Breaking News

శుభాంశుకు లక్నోలో అపూర్వ స్వాగతం 

Published on Tue, 08/26/2025 - 05:10

లక్నో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో అడుగిడిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వైమానిక దళం గ్రూప్‌ కెపె్టన్‌ శుభాంశు శుక్లాకు సోమవారం లక్నోలో అపూర్వ స్వాగతం లభించింది. యాగ్జియం–4 మిషన్‌ను దిగి్వజయం ముగించుకుని ఇటీవల ఢిల్లీకి చేరుకున్న ఆయన..మొదటిసారిగా సొంతూరుకు చేరుకున్నారు. 

ఎయిర్‌పోర్టులో తల్లిదండ్రులు శంభు, ఆశా శుక్లా, భార్య కామ్నా, కుమారుడు కియా‹Ùతోపాటు పెద్ద సంఖ్యలో అభిమానులు త్రివర్ణ పతకాలు చేబూని, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. సిటీ మాంటెస్సోరి స్కూలుకు చెందిన విద్యార్థులు డ్రమ్ములు వాయిస్తూ బాకాలు ఊదుతూ సందడి చేశారు. సొంతూరు రావడం ఎంతో ఉత్కంఠగా ఉందని శుభాంశు పేర్కొన్నారు. ఉదయం 7.30 గంటలకు లక్నోలో కాలు పెట్టిన దగ్గర్నుంచి అభిమానులతో కనీసం 2 వేల సెలీ్ఫలు తీసి ఉంటానని అన్నారు. ఓపెన్‌ టాప్‌ వాహనంలో పూల వాన కురిపిస్తుండగా త్రివేణీ నగర్‌లోని సొంతింటి వైపు ఆయన విక్టరీ పరేడ్‌ సాగింది. 

స్పేస్‌ టెక్నాలజీ చదివే విద్యార్థులకు శుభాంశు శుక్లా పేరుతో స్కాలర్‌ షిప్పులను అందజేస్తామని ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. నాసా బదులుగా ఇస్రో గురించి అందరూ మాట్లాడుకునే రోజు ఎంతో దూరంలో లేదని డిప్యూటీ సీఎం మౌర్య వ్యాఖ్యానించారు. ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ సమక్షంలో శుభాంశు శుక్లాకు సీఎం యోగి సన్మానం చేశారు. లక్నోలోని ఓ పార్కుకు శుక్లా పేరు పెడతామని మేయర్‌ తెలిపారు. నగరమంతటా పెద్ద సంఖ్యలో ఏర్పాటైన భారీ డిజిటల్, ఎల్‌ఈడీ స్క్రీన్లపై శుభాంశు శుక్లా ఘనతను ప్రదర్శించారు. శుక్లాను భారత రత్నతో గౌరవించాలని రా్రïÙ్టయ కిసాన్‌ మంచ్‌ డిమాండ్‌ చేసింది.  
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)