Breaking News

ఆపరేషన్‌ సింధూర్‌ ‘లిటిల్‌ హీరో’కు సన్మానం

Published on Sun, 07/20/2025 - 22:04

పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్‌కు వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్‌ సింధూర్‌తో భారత్‌ ఆర్మీ తన సత్తాచాటింది. పాక్‌లోకి దూసుకుపోయి మరీ ఉగ్రస్థావరాలను, పలు పాక్‌ ఎయిర్‌ బేస్‌లపై దాడులు చేసింది.   ఇందులో మన ఆర్మీ పాత్రను ఎంత కొనియాడినా తక్కువే. అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళికతో పాక్‌కు దడపుట్టించింది. ఆ దెబ్బతో పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందానికి రావడంతో దానికి భారత్‌కు అంగీకరించింది.

ఇదిలా ఉంచితే, భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌కు సాయం చేసిన ఒక  10 ఏళ్ల  లిటిల్‌ హీరో కూడా ఉన్నాడు. అదేంటి 10 ఏళ్ల పిల్లాడు ఏం చేస్తాడు అనుకుంటున్నారా?, పాక్‌ ఆర్మీతో యుద్ధం చేస్తున్న సమయంలో భారత్‌ సైనికులకు భోజనాలు అందించి తన పాత్రను నిలబెట్టుకున్నాడు. ఆపరేషన్‌ సింధూర్‌లో భాగంగా పంజాబ్‌ గ్రామంలో భారత సైనికులు యుద్ధం చేస్తున్న సమయంలో వారికి ఆ ‘బుడ్డోడు’ భోజనాలు  తదితర ఆహార పదార్థాలను సప్లై చేశాడు. దాంతో ఆ లిటిల్‌ హీరోను సత్కరించింది ఆర్మీ.  

పంజాబ్‌లోని తారా వాలి గ్రామంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆ చిన్నోడు ధైర్యాన్ని ఇండియన్‌ ఆర్మీ కీర్తించింది.  ఆపరేషన్ సిందూర్ సమయంలో పంజాబ్ గ్రామంలో తుపాకీతో పోరాడుతున్న సైనికులకు మధ్య మధ్యలో భోజనం సరఫరా చేసిన పదేళ్ల బాలుడు ష్వాన్ కథను వెస్ట్రన్ కమాండ్ కమాండింగ్-ఇన్-చీఫ్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ పంచుకున్నారు.

ఆ బాలుడి ధైర్యానికి మెచ్చిన ఇండియన్‌ ఆర్మీ.. ఆ పిల్లాడు చదువుకు అయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చింది. ష్వాన్‌ యొక్క కథ దేశంలో ఉన్నవారికి ఆదర్శం కావాలని ఆర్మీ స్పష్టం చేసింది.

 

ఫిరోజ్‌పూర్ జిల్లాలోని మామ్‌డోట్ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన 10 ఏళ్ల ష్వాన్‌... అతను కూడా పెద్దయ్యాక సైన్యంలో చేరాలని కోరుకుంటున్నాడు.‘ నేను పెద్దయ్యాక 'ఫౌజీ' కావాలనుకుంటున్నాను. దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను’ అని గతంలోనే చెప్పుకొచ్చాడు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)