Breaking News

బంగ్లాదేశ్‌కు భారత్‌ కౌంటర్‌..రాయబారికి సమన్లు

Published on Mon, 01/13/2025 - 16:14

న్యూఢిల్లీ:బంగ్లాదేశ్‌(Bangladesh) నుంచి భారత్‌(India)లోకి చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దులో కంచె నిర్మాణంపై బంగ్లాదేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో భారత హైకమిషనర్‌ ప్రణయ్‌ వర్మను బంగ్లాదేశ్‌ విదేశాంగశాఖ ఆదివారం పిలిచి వివరణ కోరింది.

ఈ వ్యవహారంపై భారత్‌ కూడా ధీటుగా స్పందించింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌ నురల్‌ ఇస్లామ్‌కు విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది.దీంతో ఆయన సోమవారం(జనవరి13) విదేశాంగశాఖ కార్యాలయానికి చేరుకుని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సరిహద్దులో అయిదుచోట్ల కంచెల ఏర్పాటుకు భారత్‌ ప్రయత్నిస్తోందని,ఇది రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని బంగ్లాదేశ్‌ ఇప్పటికే ఆరోపణలు చేసింది.

ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే భారత హైకమిషనర్‌ ప్రణయ్‌ వర్మ(Pranay Verma)కు బంగ్లాదేశ్‌ సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్‌కు వివరణ ఇచ్చిన అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ కంచెల విషయంలో రెండు దేశాల రక్షణ దళాలు బీఎస్‌ఎఫ్,బీజీబీ (బార్డర్‌ గార్డ్‌ బంగ్లాదేశ్‌)లు ఓ అవగాహనతో ఉన్నాయన్నారు.సరిహద్దు వెంట నేరాల నియంత్రణకు ఈ అవగాహన కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)