Breaking News

రైలు నుంచి అగ్ని వర్షం

Published on Fri, 09/26/2025 - 04:27

న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) ఆరుదైన ఘనత సాధించింది. ఇంటర్మిడియెట్‌ రేంజ్‌ అగ్ని–ప్రైమ్‌ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్‌ లాంచర్‌ నుంచి విజయవంతంగా పరీక్షించింది. బుధవారం జరిగిన ఈ పరీక్షలో స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌(ఎస్‌ఎఫ్‌సీ) సైతం పాలుపంచుకుంది. అయితే, ఈ పరీక్ష ఎక్కడ చేపట్టారన్నది రక్షణ శాఖ బహిర్గతం చేయలేదు. స్థిరమైన ప్రదేశం నుంచి కాకుండా పట్టాలపై పరుగులు తీస్తున్న రైలు నుంచి మిస్సైల్‌ను పరీక్షించడం భారత క్షిపణి తయారీ రంగంలో ఒక కీలకమైన మైలురాయిగా భావిస్తున్నారు.

క్షిపణులను దేశంలో ఎక్కడికైనా రైలులో సులభంగా తరలించే సామర్థ్యాన్ని భారత్‌ సాధించడం గమనార్హం. తదుపరి తరం అగ్ని–ప్రైమ్‌ మిస్సైల్‌ పరిధి 2,000 కిలోమీటర్లు. ఈ పరీక్ష విజయవంతం కావడం పట్ల రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తంచేశారు. రైలు నెట్‌వర్క్‌ నుంచి ఆయుధ వ్యవస్థను ప్రయోగించే సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్‌ సైతం సగర్వంగా చేరిందని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన రైలు ఆధారిత మొబైల్‌ లాంచర్‌ నుంచి అగ్ని–ప్రైమ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించినట్లు స్పష్టంచేశారు. అతి తక్కువ సమయంలోనే మిస్సైల్‌ను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించి, ప్రయోగించే సత్తా మన సొంతమని ఉద్ఘాటించారు. ఈ మేరకు రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.  

అత్యాధునిక క్షిపణి  
అగ్ని–ప్రైమ్‌ క్షిపణి అత్యాధునికమైనదని రక్షణ శాఖ వెల్లడించింది. అగ్ని బాలిస్టిక్‌ క్షిపణుల శ్రేణిలో దీన్ని అభివృద్ధి చేశారు. ఇందులో నూతన తరం కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, రక్షణ యంత్రాంగం ఉన్నట్లు పేర్కొంది. గ్రౌండ్‌ స్టేషన్‌ నుంచి క్షిపణిని నియంత్రించవచ్చని స్పష్టంచేసింది. భవిష్యత్తులో రక్షణ దళాల్లో రైలు ఆధారిత ఆయుధ వ్యవస్థలు, క్షిపణులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. అగ్ని–ప్రైమ్‌ క్షిపణి పరీక్ష కార్యక్రమంలో డీఆర్‌డీఓ, ఎస్‌ఎఫ్‌సీ సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. ‘రోడ్‌ మొబైల్‌ వేరియెంట్‌’ అగ్ని–ప్రైమ్‌ క్షిపణులను ఇప్పటికే రక్షణ దళాల్లో ప్రవేశపెట్టారు. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్‌–పాకిస్తాన్‌ మధ్య ఘర్షణ జరిగిన తర్వాత నాలుగున్నర నెలల్లోగా రైలు ఆధారిత మొబైల్‌ లాంచర్‌తో మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

గేమ్‌ చేంజర్‌  
అగ్ని–ప్రైమ్‌ పరీక్ష కోసం రైలును ప్రత్యేకంగా రూపొందించారు. సాధారణ రైళ్లు ప్రయాణించే పట్టాలపైనే ఇది పరుగులు తీస్తుంది. శత్రు దేశాల రాడార్లు గుర్తించకుండా క్షిపణిని రైలు లోపల దాచిపెట్టి తరలించవచ్చు. వర్షం, ఎండ, చలి వంటి వాతావరణ పరిస్థితుల్లోనూ తరలించే అవకాశం ఉండడం మరో ప్రత్యేకత. దేశవ్యాప్తంగా రైలు నెట్‌వర్క్‌ ఉండడం సైన్యానికి కలిసొచ్చే అంశం. క్షిపణులను రైలు ద్వారా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇదొక ‘గేమ్‌ చేంజర్‌’ అని డీఆర్‌డీఓ వర్గాలు స్పష్టంచేశాయి. రష్యా, చైనా తదితర దేశాలు రైలు ఆధారిత మొబైల్‌ మిస్సైల్‌ వ్యవస్థలను అభివృద్ధి చేసుకున్నాయి. అణుశక్తి సంపన్న దేశమైన భారత్‌ బహుళ రీతుల్లో క్షిపణులను ప్రయోగించే సామర్థ్యాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)