amp pages | Sakshi

మిలటరీ సామర్థ్యంలో స్థిరంగా భారత్‌

Published on Sun, 01/29/2023 - 05:21

ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి
మిలటరీ సామర్థ్యంలో మన దేశం నాలుగో స్థానంలో నిలిచింది. ‘గ్లోబర్‌ ఫైర్‌ పవర్‌’ (జీఎఫ్‌పీ) సూచీ–2023 ఇటీవల విడుదలైంది. ఈ సూచీలో 2006 నుంచి భారత్‌ నాలుగో స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. తాజా సూచీలో అమెరికాకు తొలి ర్యాంకు రాగా.. రెండు, మూడు స్థానాల్లో రష్యా, చైనా ఉన్నాయి. జీఎఫ్‌పీ సూచీ రూపొందించిన 2005 నుంచి ఇప్పటివరకు అమెరికా తొలి ర్యాంకులోనే ఉంది. 2005, 2006 సూచీల్లో రెండోస్థానంలో నిలిచిన చైనా.. ఆ తర్వాత రష్యా ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2007 నుంచి ఇప్పటివరకు రెండు, మూడు స్థానాల్లో రష్యా, చైనా కొన­సాగుతున్నాయి. 2005 సూచీలో పాకిస్తాన్‌ నాలుగో స్థానంలో ఉండగా, 2006లో 5వ స్థానానికి, 2007లో 20వ స్థానానికి పడిపోయింది. 2010కి కాస్త మెరుగుపడి 15వ స్థానానికి చేరింది. ఇప్పుడు తాజాగా 2022లో 9వ స్థానానికి వచ్చిన పాకిస్తాన్‌... ఈ సంవత్సరం 7వ స్థానంలో నిలిచింది. 

ప్రపంచ యుద్ధాల్లో కదన రీతిని సమూలంగా మార్చేసిన యుద్ధట్యాంకులు.. ఆధునిక యుగంలోనూ సైన్యం శక్తిసామర్థ్యాలకు మూలస్తంభాలుగా యుద్ధట్యాంకులు నిలవడం గమనార్హం. 
► ఆధునిక ఆయుధ సంపత్తి సమకూరిన తర్వాత సైన్యం సామ­ర్థ్యా­న్ని లెక్కగట్టడంలో ఇప్పటికీ యుద్ధట్యాంకులు కీలక భూ­మి­క పోషిస్తున్నాయి. యుద్ధ ట్యాంకులూ ఆధునికతను సంతరిం­చుకుని, సాయుధ బలగాలకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. 
► రష్యా వద్ద ఇవి అత్యధికంగా 12,566, భారత్‌ వద్ద 4,614 ట్యాంకులున్నాయి. 
► అర్జున్‌ లాంటి అత్యాధునిక భారీ యుద్ధ ట్యాంకులతో పాటు తక్కువ బరువైన (గరిష్టంగా 25 టన్నులు) యుద్ధ ట్యాంకులు కూడా భారత్‌ సైన్యం వద్ద ఉన్నాయి. 
► కృత్రిమ మేధస్సును వాడుకునే సామర్థ్యం ఉన్న అత్యాధునిక ట్యాంకులు మన సొంతం. 
► ఇక ఎత్తయిన ప్రదేశాల్లోనూ, భౌగోళికంగా అత్యంత అనుకూల పరిస్థితులున్న చైనా సరిహద్దు ప్రాంతాల్లో శత్రు­వు­లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తక్కువ బరు­వున్న యుద్ధ ట్యాంకులను సమకూర్చుకోవడానికి భారత్‌ దేశీయ పరిజ్ఞానంతో ‘ప్రాజెక్టు జొరావర్‌’ చేపట్టింది. 
► భారీ ట్యాంకులకు ఇవి ఏమాత్రం తక్కువ కాదు. 

అమెరికాలోనే ఎక్కువగా..
అత్యాధునిక యుద్ధ ట్యాంకులు తయారుచేస్తున్న అమె­రికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లో చూస్తే అమెరికా వద్దే పెద్ద సంఖ్యలో ట్యాంకులు ఉన్నాయి. మిగతా అగ్ర దేశా­లు తాము ఉత్పత్తి చేసిన ట్యాంకులను ఇతర దేశాలకు విక్రయించడమే తప్ప తమ సైన్యానికి ఇవ్వలేదు. అత్యా­ధునిక లెపర్డ్‌–2 ఉత్పత్తి చేస్తున్న జర్మనీ తన వద్ద ఉంచుకున్న ట్యాంకులు 266 మాత్రమే. ఛాలెంజర్‌–2లను ఉత్పత్తి చేస్తున్న యూకే.. తన వద్ద ఉన్న ఈ ట్యాంకుల సంఖ్య 227 మాత్రమే. అవి నాటో దేశాలు కావడంవల్లే భారీగా ట్యాంకులు సమకూర్చుకోవడం లేదు. 

ఉక్రెయిన్‌ వద్ద ఆనాటి ట్యాంకులు
ఉక్రెయిన్‌ ఒకప్పటి యూఎస్‌ఎస్‌ఆర్‌లో భాగం. ఉక్రె­యిన్‌ వద్ద ఉన్న యుద్ధ  ట్యాంకుల్లో యూఎస్‌ఎస్‌ఆర్‌ కాలం నాటివే ఎక్కువ. రష్యా యుద్ధ ట్యాంకులను కొన్నింటిని స్వాధీనం చేసుకుని వాడుతున్నారు. అత్యా­ధునిక యుద్ధ ట్యాంకులు ఇస్తే రష్యాతో యుద్ధ స్వరూ­పాన్ని సమూలంగా మార్చేయాలని ఉక్రెయిన్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వీటిని ఇవ్వమని నాటో సభ్య దేశాలను అడుగుతోంది. ఇటీవల జర్మనీలో జరిగిన వివిధ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో ఉక్రెయిన్‌ విజ్ఞప్తి మీద చర్చ జరిగినా సానుకూల నిర్ణయం రాలేదు.

ర్యాంకుల కథాకమామిషు..
ప్రపంచ దేశాల సైన్యాల కదన సామర్థ్యం ఆధారంగా ‘గ్లోబర్‌ ఫైర్‌ పవర్‌’ (జీఎఫ్‌పీ) అంతర్జాతీయ సంస్థ 2005 నుంచి ఏటా ర్యాంకులు ఇస్తోంది. సంప్రదాయ పద్ధతుల్లో ఆయా దేశాల నింగి, నేల, జల యుద్ధ సామర్థ్యాలు, సైన్యాలకు అందుబాటులో ఉన్న మానవ వనరులు, ఆయుధ సంపత్తి, సహజ వనరులు, దేశ రక్షణకు చేస్తున్న వ్యయం, భౌగోళిక పరిస్థితులు, పొరుగు దేశాల నుంచి ఒత్తిడి, సరిహద్దు పాయింట్లు.. ఇలా 60కి పైగా అంశాలను పరిగణనలోకి తీసుకుని 145 దేశాలకు ‘గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌’ ర్యాంకులు ఇస్తోంది.  

Videos

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)