Breaking News

పన్నూ హత్యకు కుట్ర.. యూఎస్‌ మీడియా రిపోర్డును ఖండించిన భారత్‌

Published on Tue, 04/30/2024 - 12:07

ఢిల్లీ: అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్ పన్నూను హత్యచేసేందుకు భారత మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి ప్రణాళికా రచించాడని వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించిన నివేదికను భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత రా(RAW)మాజీ అధికారి విక్రమ్‌ యాదవ్‌ అమెరికాలో గురుపత్వంత్ సింగ్‌ను హత్య చేయాలని ఓ బృందాన్ని ఏర్పాటు చేశారని వాషింగ్టన్‌ పోప్ట్‌ తన రిపోర్టులో తెలిపింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్ స్పందించారు. 

‘వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం పూర్తిగా అసమంజసం, నిరాధారమం. క్రిమినల్‌, ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు సంబంధించి అమెరికా లేవనెత్తిన భద్రతా సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుంది. అయినప్పటికీ ఊహాగానాలు, బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేయటం సరికాదు.  ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు’ అని అ‍న్నారు. 

ఈ కేసులో కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తాకు  సీసీ-1 అనే పేరు తెలియని  అధికారి సాయం చేసినట్లు అమెరికా పేర్కొంది. అయితే తాజాగా వాషింగ్టన్‌పోస్ట్‌ ఆ అధికారిని  విక్రమ్‌ యాదవ్‌గా గుర్తించింది. ఈ కేసులో అమెరికా తరచూ చేస్తున్న ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అమెరికా ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్‌ 2023 నవంబర్‌లో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)