Breaking News

రైలు హైజాక్‌లో ఢిల్లీ హస్తమంటూ పాక్‌ కూతలు.. భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్

Published on Fri, 03/14/2025 - 11:18

ఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్‌ మరోసారి భారత్‌ విషం చిమ్మే ప్రయత్నం చేసింది. ఇటీవల బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు రైలును హైజాక్ చేయడంలో, వారిని రెచ్చగొట్టడంతో భారత్‌ పాత్ర ఉంది పాకిస్థాన్‌ ఆరోపించింది. అంతేకాకుండా పొరుగుదేశాల్లో అస్థిరతకు భారత్‌ కృషి చేస్తోందని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలను భారత్‌ తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు అంటూ విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు.

ఇటీవల బలుచిస్తాన్‌లో ప్యాసింజర్‌ రైలు హైజాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు భారత్‌ కారణమంటూ తాజాగా పాక్‌ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్‌ఖత్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండకు పాల్పడుతోందన్నారు. భారత మీడియా బీఎల్‌ఏను కీర్తిస్తోంది. ఇది అధికారికంగా కాకపోయినా ఒక విధంగా ప్రసారం చేస్తోంది అంటూ ఇష్టానుసారం ఆరోపణలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో షఫ్‌ఖత్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘పాక్‌ విదేశీ విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్‌  నిరాధార ఆరోపణలు చేస్తోంది. వారు ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులు తమ అంతర్గత సమస్యలపై దృష్టిసారిస్తే బాగుంటుంది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. ముందు అవ్వన్నీ చూసుకోవాలి’ అంటూ హితవు పలికారు.

ఇదిలాఉండగా.. ఇటీవల పాక్‌లోని బలోచిస్థాన్‌లో ప్రయాణికుల రైలును వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్లు హైజాక్‌ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 400 మంది ప్రయాణిస్తున్న ఈ రైలుపై మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా.. 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్‌ను పేల్చి జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఇప్పటికే బలోచ్‌ మిలిటెంట్లు 33 మందిని చంపేసినట్లు పాకిస్థాన్‌ సైన్యం ప్రకటించింది. 21 మంది ప్రయాణికులతో సహా నలుగురు సైనికులు వారి చేతిలో హతమయ్యారని తెలిపింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)