Breaking News

ట్రంప్‌ మాటలు ఉత్త డొల్ల 

Published on Fri, 05/30/2025 - 06:15

న్యూఢిల్లీ:  భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య యుద్ధాన్ని ఆపేశానని, తాను చొరవ తీసుకోకపోయి ఉంటే రెండు దేశాల మధ్య కచి్చతంగా అణుయుద్ధం జరిగేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీర్‌ జైస్వాల్‌ తిప్పికొట్టారు. మాట వినకపోతే టారిఫ్‌లు విధిస్తామని, వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటామని బెదిరించడంతో భారత్, పాక్‌లు దారికొచ్చాయని, బుద్ధిగా కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్‌ చెప్పడాన్ని ఖండించారు. 

పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో అమెరికాలో జరిగిన చర్చల్లో టారిఫ్‌ల అంశమే ప్రస్తావనకు రాలేదని గురువారం తేలి్చచెప్పారు. గత నెల 7 నుంచి 10వ తేదీ దాకా అమెరికాలో పలుమార్లు సంప్రదింపులు జరిగాయని అన్నారు. పాకిస్తాన్‌తో నెలకొన్న ఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితుల గురించి మాత్రమేని మాట్లాడామని తెలిపారు. టారిఫ్‌లు, వాణిజ్య సంబంధాల అంశాన్ని అమెరికా లేవనెత్తలేదని స్పష్టంచేశారు. 

ట్రంప్‌ ప్రకటనల్లో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది కేవలం రెండు దేశాలకు సంబంధించిన అంశమని, ఇందులో మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని వెల్లడించింది. అయినప్పటికీ అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పటికీ నోరుపారేసుకుంటూనే ఉంది.

 ట్రంప్‌ హెచ్చరికల కారణంగానే భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచి్చనట్లు ఈ నెల 23న కోర్టు ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌కు అమెరికా ప్రభుత్వం తెలియజేసింది. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్‌ ప్రతిపాదించిన అధిక టారిఫ్‌లకు చట్టపరమైన ఇబ్బందులు రాకుండా కోర్టు ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌కు తప్పుడు వివరణలు ఇస్తున్నట్లు అమెరికాపై సర్కారుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)