Breaking News

‘ఫ్రెంచ్‌ జర్నలిస్ట్‌ సెబాస్టియన్‌ వ్యాఖ్యలు సరికాదు’

Published on Sat, 06/22/2024 - 14:27

సార్వత్రిక ఎన్నికలను కవర్‌ చేయకుండా తనను దేశం విడిచి వెళ్లమని భారత హోంశాఖ చెప్పినట్లు ఫ్రెంచ్‌ జర్నలిస్ట్‌  సెబాస్టియన్‌ ఫ్రాన్సిస్‌ చేసిన ఆరోపణలపై భారత్‌ శనివారం స్పందించింది. భారత దేశం వదలి వెళ్లాల్సి  వచ్చిందని సెబాస్టియన్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలిపింది. ఆయన వర్క్‌ పర్మిట్‌ రిన్యూవల్ పునరుద్ధరణ పరిశీలనలో ఉందని స్పష్టం చేసింది.

‘ఫ్రాన్సిస్‌ ‘ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా’ గుర్తింపు కార్డును కలిగి ఉన్నారు. అయితే జర్నలిజం కవరేజీకి సంబంధించి కొన్ని నిబంధనలకు అనుమతి కలిగి ఉండాలి. 2024  మేలో  ఆయన  వర్క్‌ పర్మిట్‌  రిన్యూవల్‌ కోసం మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన దరఖాస్తును తాము పరిశీలిస్తున్నాం. ఇక దేశం బయట ఆయన  చేసే ప్రయాణానికి సంబంధి పూర్తి హక్కులు ఉన్నాయి ’అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు.

‘2024 సార్వత్రిక ఎన్నికల కవరేజీ చేయకుండా బలవంతంగా నేను భారత్‌ వెళ్లి పోవాల్సి వచ్చింది. దీంతో జూన్‌ 17న  భారత్‌ నుంచి వెళ్లిపోయాను. మార్చి 7న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన జర్నలిస్ట్‌ అనుమతిని పునరుద్దరించడానికి నిరాకరించింది. సాధారణ ఎన్నికలను కవర్‌  చేసేందుకు తిరస్కరించింది. 2011 నుంచి నేను జర్నలిస్ట్‌గా భారత్‌లో పనిచేస్తున్నా. నేను భారతీ మహిళను వివాహం చేసుకున్న కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నా కుటుంబం ప్రభావితం అవుతుంది’ అని సెబాస్టియన్‌ ఫ్రాన్సిస్‌ ‘ఎక్స్‌’లో తెలిపారు.

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)