Breaking News

భారత్‌ ‘మెగా రోడ్డు’తో డ్రాగన్‌కు చుక్కలే..

Published on Tue, 12/23/2025 - 13:42

న్యూఢిల్లీ: తరచూ దుందుడుకు చర్యలకు పాల్పడే చైనాకు భారత్‌ అడ్డుకట్ట వేస్తోంది. చైనా సరిహద్దు వెంబడి భారత్ మరో భారీ వ్యూహాత్మక అడుగు వేసింది. ఉత్తరాఖండ్‌లోని నీలపాణి నుండి ములింగ్ లా వరకు 16,134 అడుగుల అత్యంత ఎత్తైన ప్రాంతంలో 32 కిలోమీటర్ల మేర నిర్మితమవుతున్న‘మెగా రోడ్డు’ పనులను భారత్‌ ముమ్మరం చేసింది. అన్ని వాతావరణాలను తట్టుకునేలాంటి రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. రూ. 104 కోట్ల వ్యయంతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) చేపడుతున్న ఈ ప్రాజెక్టు, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)వద్ద భారత సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచనున్నది.

ప్రస్తుతం ములింగ్ లా బేస్ క్యాంపు చేరుకోవాలంటే సైనికులు ఐదు రోజుల పాటు కఠినమైన కొండ మార్గాల్లో ట్రెక్కింగ్ చేయాల్సి వస్తున్నది. శీతాకాలంలో భారీ హిమపాతం కారణంగా ఈ మార్గం పూర్తిగా మూసుకుపోతుంటుంది. దీంతో కేవలం హెలికాప్టర్ల ద్వారానే ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే ఈ నూతన రహదారి పూర్తయితే, ఐదు రోజుల ప్రయాణం కేవలం కొద్ది గంటల్లోనే ముగియనుంది. తద్వారా దళాల మోహరింపు, రేషన్, ఇంధనం, యుద్ధ సామగ్రిని ఏడాది పొడవునా ఎటువంటి ఆటంకం లేకుండా నేరుగా సరిహద్దుకు చేరవేసే అవకాశం కలుగుతుంది.

ఒకప్పుడు సరిహద్దుల్లో రహదారులు నిర్మిస్తే చైనా చొరబడుతుందని భారత్‌ భావించింది. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని పక్కనపెట్టి,‘కనెక్టివిటీయే బలం’ అనే దిశగా అడుగులు వేస్తోంది. టిబెట్ ప్రాంతంలో చైనా ఇప్పటికే భారీగా రోడ్డు, రైలు నెట్‌వర్క్‌ను నిర్మించింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. 2020 తూర్పు లడఖ్ ప్రతిష్టంభన తర్వాత, సరిహద్దుల్లోని చివరి మైలు వరకు సైనిక కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా మెగా రోడ్డు పనులు జరుగుతున్నాయి.

హిమాలయాల్లోని అత్యంత కఠినమైన భూభాగంలో సాగుతున్న ఈ రోడ్డు నిర్మాణం ఇంజనీరింగ్ పరంగా పెద్ద సవాలుతో కూడుకున్నది. ఈ రహదారి పూర్తయితే వాయు సేనపై ఆధారపడే అవసరం తగ్గి, రక్షణ వ్యయం గణనీయంగా ఆదా  కానుంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు పటిష్టంగా ఉంటేనే, వేగవంతమైన ప్రతిస్పందన సాధ్యమని భారత్‌ భావిస్తోంది. తద్వారా సరిహద్దు ప్రాంతాలు మరింత సుస్థిరంగా ఉంటాయని రక్షణ నిపుణులు అంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో చైనా చొరబాట్లకు  భారత్‌ సమర్థవంతంగా అడ్డుకట్ట వేయగలదని చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: liquor Scam: మాజీ సీఎం కుమారునికి రూ. 250 కోట్లు?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)