Breaking News

ప్రగతి పథంలో ముందుకు 

Published on Mon, 09/15/2025 - 06:31

ఇండోర్‌: భారతీయ సంప్రదాయక విజ్ఞానాన్ని నమ్ముకున్న భారత్‌ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయపథంలో దూసుకుపోతోందని రాష్ట్రీయ స్వయంసేవక్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యానించారు. గత ఐదు త్రైమాసికాలతో పోలిస్తే ఈ ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో ప్రతి ఒక్కరి అంచనాలు పటాపంచలు చేస్తూ భారత్‌ ఏకంగా 7.80 శాతం వృద్ధిరేటును సాధించిన నేపథ్యంలో భారత పురోభివృద్ధిని భాగవత్‌ ప్రస్తావించడం గమనార్హం. 

ఆదివారం మధ్యప్రదేశ్‌ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌కు చెందిన ‘పరిక్రమ కృపాసారం’పుస్తకాన్ని ఇండోర్‌లో ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో భాగవత్‌ మాట్లాడారు. ‘‘3,000 ఏళ్లపాటు భారత్‌ విశ్వశక్తిగా కొనసాగినన్నిరోజులు ప్రపంచంలో ఎలాంటి ఆధిపత్యపోరు, సంఘర్షణలు జరగలేదు. ఇప్పుడు ప్రపంచదేశాల్లో నెలకొన్న ఘర్షణలన్నీ స్వప్రయోజనాలకు సంబంధించినవే. ఇవే అన్ని సమస్యలకు మూలం. భారతీయుల పూర్వీకులు జ్ఞాన, కర్మ, భక్తి భావనలను ఎలా సమన్వయం చేసుకుని జీవించాలో మనకు బోధించారు. 

ఈ సంప్రదాయక తత్వాన్ని భారత్‌ మనసావాచా కర్మణా పాటిస్తోంది. అందుకే ప్రతి ఒక్కరి అంచనాలను తప్పు అని ప్రకటిస్తూ ప్రగతిపథంలో భారత్‌ వడివడిగా అడుగులు వేస్తోంది’’అని అన్నారు. మాజీ బ్రిటన్‌ ప్రధానమంత్రి విన్‌స్టన్‌ చర్చిల్‌ చేసిన వ్యాఖ్యలను భాగవత్‌ ఉదహరిస్తూ.. ‘‘మేం(బ్రిటన్‌) మీకు (భారత్‌కు) స్వాతంత్య్రం ఇస్తే అంతర్గత వైషమ్యాలు, విబేధాలతో విడిపోతారు. కలిసి ఉండటం కల’అని వెక్కిరించారు. ఆయన అంచనాలు సైతం తప్పు అని భారత్‌ నిరూపించింది. ఐకమత్యాన్ని చాటింది. ఆర్థికాభివృద్ధితో పురోగమిస్తోంది. 

విడిపోదామని బ్రిటన్‌లోనే కొన్ని ప్రాంతాల నుంచి డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్‌ విభజన దిశలో అడుగులేస్తోంది. కానీ భారత్‌ విడిపోదు. మనం ముందుకే వెళతాం. గతంలో మనం విభజనకు గురయ్యాం ఇప్పుడు మళ్లీ ఆ ఐక్యతను సుసాధ్యంచేద్దాం’’అని అన్నారు. విశ్వాసాలు, నమ్మకాల మీదనే ప్రపంచం ముందుకుపోతోంది. అలాంటి నమ్మికలకు భారత్‌ పుట్టినిల్లు. ఇక్కడి వాళ్లంతా కర్మసిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. 

గోవులు, నదీమతల్లులు, వృక్షాలను పూజిస్తూ తద్వారా ప్రకృతి ఉపాసనను భారతీయులు ఆచరిస్తారు. అలా ప్రకృతిలో జీవిస్తారు. అలాంటి ప్రకృతి సంబంధం కోసం నేటి సమాజం అర్రులుచాస్తోంది. కానీ గత 300–350 సంవత్సరాలుగా ప్రపంచంలో చాలా దేశాలు ఎవరి దారి వారిదే, బలవంతులే బతకాలి అనే తప్పుడు వాదనకు జైకొట్టాయి. దాంతో సమస్యలొస్తున్నాయని వాళ్లకు ఇప్పడు అర్థమైంది. జీవితనాటకంలో మనందరం పాత్రధారులం. నాటకం ముగిసినప్పుడే మనం ఎవరనేది మనకు బోధపడుతుంది’’అని ఆయన అన్నారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)