Breaking News

భారత్‌కు ట్రంప్‌ హెచ్చరిక.. కీలక ప్రకటన చేయనున్న నిర్మలా సీతారామన్‌?

Published on Wed, 01/29/2025 - 16:09

ఢిల్లీ : అమెరికా (usa) వాసులకు ఆదాయపు పన్ను రద్దు చేస్తామని, భారత్‌తో పాలు దేశాలపై దిగుమతి సుంకాలు విధిస్తామని డొనాల్డ్‌ ట్రంప్ (donald trump) జారీ చేసిన హెచ్చరికలతో భారత్‌ అప్రమత్తమైంది. అమెరికా నుంచి దిగుమతి చేసే ప్రీమియం ఉత్పత్తులపై భారత్‌ విధించే సుంకాల్ని (tariffs )తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

భారత్‌... అమెరికా నుంచి స్ట్రీల్‌, ఖరీదైన ద్విచక్రవాహనాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులతో పాటు సుమారు 20 రకలా ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటుంది.  వాటిపై 100 శాతం కంటే ఎక్కువ సుంకాల్ని (పన్నులు) వసూలు చేస్తోంది.వాటిపై విధించే సుంకాల్ని తగ్గించనుందని, దీనిపై జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న  పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌  ప్రకటన చేయనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.  

ఫ్లోరిడా రీట్రీట్‌లో హౌస్‌ ఆఫ్‌ రిపబ్లికన్స్‌ను ఉద్దేశించి ట్రంప్‌ మాట్లాడుతూ.. అమెరికాకు నష్టం కలిగిస్తున్న దేశాల ఉత్పత్తులపై అధిక సుంకాలు(టారిఫ్స్‌) విధిస్తామని పునరుద్ఘాటించారు. బయటి దేశాలు, బయటి వ్యక్తులపై సుంకాలు విధించక తప్పదని తేల్చి చెప్పారు. చైనా, ఇండియా, బ్రెజిల్‌ దేశాల పేర్లను ప్రస్తావించారు. అమెరికా ఉత్పత్తులపై ఆయా దేశాలపై అధిక పన్నులు విధిస్తున్నారని ఆక్షేపించారు. అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నా మని గుర్తుచేశారు. తమ దేశానికి నష్టం కలిగిస్తున్న విధానాలకు చరమగీతం పాడడం ఖాయమని అన్నారు. తమకు ఆర్థికంగా నష్టం కలిగిస్తున్న దేశాల ఉత్పత్తులపై అధిక పన్నులు వసూలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.

ఆ తర్వాత ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘అక్రమ వలసదార్లను వెనక్కితీసుకొనే విషయంలో  మోదీ ఏది సరైందో అదే చేస్తారు.  అక్రమ వలసల వ్యవహారంపై భారత ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయి. మోదీ వచ్చే నెలలో శ్వేతసౌధాన్ని సందర్శించే అవకాశం ఉంది.ఇండియాతో తనకు చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయి’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

కొలంబియా ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌ విధిస్తామని ట్రంప్‌ హెచ్చరించడం సంచలనం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన కొలంబియా ప్రభుత్వం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న తమ పౌరులను వెనక్కి తీసుకెళ్ల్లడానికి అంగీకరించింది. కెనడా, మెక్సికోపై ట్రంప్‌ ఇదే అస్త్రం ప్రయోగించబోతున్నారు. ఆ రెండు దేశాల ఉత్పత్తులపై సుంకాల మోత మోగించనున్నట్లు తెలుస్తోంది. అతిత్వరలో ఇది అమల్లోకి రానున్నట్లు సమాచారం. అయితే, విదేశీ వస్తువులపై సుంకాలు పెంచితే దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందని అమెరికా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

👉చదవండి : నేను తాగే నీళ్లలో విషం కలుపుతారా?

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)