Breaking News

Corona Alert: ఒక్కసారిగా పెరిగిన కేసులు.. 230 రోజుల తర్వాత ఈ స్థాయిలో

Published on Thu, 04/13/2023 - 10:07

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కోవిడ్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజూవారీ పాజిటివ్‌ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కొత్త కేసుల సంఖ్య 10 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 10,158 మంది వైరస్‌ బారిన పడ్డారు. కిందటి రోజుతో పోలిస్తే 30శాతం అధికంగా నమోదయ్యాయి. గత గత ఏడు నెలల్లో(230 రోజులు) ఇంత భారీ స్థాయిలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. 

మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,42,10,127కు చేరింది. ప్రస్తుతం 44,998 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివ్‌ రేటు 4.42శాతానికి పెరిగింది. రికవరీ రేటు 98.71శాతం.. మరణాల రేటు 1.19%గా ఉంది. భారత్‌లో  సగటున గత వారంలో రోజుకు 5,555 కోవిడ్‌ కేసులు నమోదవ్వగా అంతకు ముందు వారం 3,108 వెలుగు చూశాయి.

అయితే కరోనా వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ ప్ర‌స్తుతం దేశంలో కోవిడ్ ఎండ‌మిక్ ద‌శ‌లోకి ప్ర‌వేశిస్తోంద‌ని వైద్య నిపుణులు వెల్లడించారు. వ‌చ్చే 10 నుండి 12 రోజుల్లో కొత్త కేసులు పెరుగుతాయ‌ని పేర్కొన్నారు. కానీ ఆ త‌ర్వాత కేసులు త‌గ్గుతాయ‌ని తెలిపారు. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్ప‌త్రిలో చేరిక‌లు మాత్రం త‌క్కువ‌గా ఉన్నాయ‌ని రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొన‌సాగుతుంద‌ని చెప్పారు.

అయితే కొత్త కేసులపై  ఆందోళన అవసరం లేదని అన్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటే చాలని.. దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్లు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ప్రస్తుతం దేశంలో  ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌ ఎక్స్‌బీబీ.1.16 కారణంగా భారత్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు.
చదవండి: గుడ్‌న్యూస్‌..మళ్లీ కోవిషీల్డ్‌ ఉత్పత్తి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)