Breaking News

హెచ్‌టీటీ–40  టెస్టు సక్సెస్‌ 

Published on Sat, 10/25/2025 - 05:28

న్యూఢిల్లీ:  ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్య సాధనలో భాగంగా రక్షణ తయారీ రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్‌ మరో అడుగు ముందుకేసింది. బెంగళూరులోని హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) తయారుచేసిన మొట్టమొదటి దేశీయ శిక్షణ విమానం హిందూస్తాన్‌ టర్బో ట్రైనర్‌–40(హెచ్‌టీటీ–40) ఆకాశంలో విజయవంతంగా దూసుకెళ్లింది. ఎలాంటి లోపాలు లేకుండా విమా నం అద్భుతమైన స్థిరత్వాన్ని, పనితీరును కనబర్చినట్లు హెచ్‌ఏఎల్‌ అధికారులు ధ్రువీకరించారు. 

శుక్రవారం బెంగళూరులో ఈ విమానాన్ని పరీక్షించారు. హెచ్‌టీటీ–40 అనేది బేసిక్‌ ట్రైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌. భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) పైలట్లకు ఇందులో శిక్షణ ఇవ్వబోతున్నారు. దీనిద్వారా వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించవచ్చు. సైనిక విన్యాసాలు చేపట్టవచ్చు. రాత్రిపూట కూడా పనిచేస్తుంది. 

హెచ్‌టీటీ–40ని పూర్తిగా హెచ్‌ఏఎల్‌ అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేసింది. ఇందులో అత్యాధునిక వసతులున్నాయి. ఈ విమానంతో తక్కువ ఖర్చుతోనే పైలట్లకు శిక్షణ ఇవ్వొ చ్చు. దేశీయంగానే రక్షణ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోందని హెచ్‌ఏఎల్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వైమానిక దళంలో పాత కాలం నాటికి విమానాలతోనే శిక్షణ ఇస్తున్నారు. వీటి స్థానంలో ఇకపై హెచ్‌టీటీ–40 విమానాలను ప్రవేశపెట్టబోతున్నారు.   
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)