Breaking News

త్వరలో ముంబై–అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు సేవలు

Published on Mon, 08/04/2025 - 04:41

భావ్‌ నగర్‌: దేశంలోని తొలి బుల్లెట్‌ రైలు సేవలు త్వరలో ప్రారంభం అవుతాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. దీంతో అహ్మదాబాద్‌ నుంచి ముంబైకి కేవలం రెండు గంటల ఏడు నిమిషాల్లో చేరుకోవచ్చని ఆయన తెలిపారు. అయోధ్య ఎక్స్‌ప్రెస్, రేవా–పుణే ఎక్స్‌ప్రెస్, జబల్‌పూర్‌–రాయ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఆదివారం భావ్‌నగర్‌ టెర్మినస్‌లో వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. 

ముంబై–అహ్మదాబాద్‌ తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్‌ రైలు ముంబై–అహ్మదాబాద్‌ మధ్య 508 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఇది ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ నుంచి ప్రారంభమై, గుజరాత్‌లోని వాపి, సూరత్, ఆనంద్, వడోదర గుండా అహ్మదాబాద్‌కు వెళ్తుంది. గంటకు 320 కి.మీ. వేగంతో నడవనుంది. ఈ సందర్భంగా మంత్రి పలు రాష్ట్రాల్లోని రైల్వే ప్రాజక్టుల గురించి పంచుకున్నారు. 

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా అనేక కొత్త ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలు ప్రాజెక్టులను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్లలో 34వేల కి.మీ.ల కొత్త రైల్వే ట్రాక్‌లను వేసింది, దేశంలో రోజుకు దాదాపు 12 కి.మీ కొత్త ట్రాక్‌లను నిర్మించిందని చెప్పారు. దేశంలో 1,300 రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నామని, ఇది ఇంతకుముందెప్పుడూ చేయని పనని ఆయన కొనియాడారు. 

ఈ క్రమంలో వస్తున్న సవాళ్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దార్శనికతతో ప్రధాని మోదీ స్టేషన్ల పునరుద్ధరణ చేయిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది అమృత్‌ భారత్‌ రైళ్లు ప్రారంభించామని, వాటిలోనూ వందే భారత్‌వంటి సౌకర్యాలు కలి్పంచామని, అయినా ఛార్జీలు మాత్రమే తక్కువగానే ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ఈ రైళ్లను కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించారని, వీటిలో ప్రయాణిస్తున్న వారు గొప్ప భావోద్వేగాలకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)