Breaking News

‘రయ్‌’లు

Published on Tue, 12/09/2025 - 05:17

గుజరాత్‌ నుంచి సాక్షి ప్రతినిధి: అహ్మదాబాద్‌–ముంబై మధ్య భారతదేశంలో మొదటి హై స్పీడ్‌ రైల్‌ (బుల్లెట్‌ ట్రైన్‌) ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల మధ్య 508 కిలోమీటర్ల (మహారాష్ట్రలో 156 కి.మీ, గుజరాత్‌లో 352 కి.మీ) దూరాన్ని కేవలం 2 గంటల్లో పూర్తిచేయడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2027 ఆగస్టులో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌ – బిలిమోరా మధ్య సుమారు 50 కి.మీ దూరంలో ఈ రైలుకు ట్రయల్‌ రన్‌ చేపట్టనున్నట్టు నేషనల్‌ హై–స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అహ్మదాబాద్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రాజేష్‌ అగర్వాల్‌ సోమవారం ‘సాక్షి’కి వివరించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 2017 సెపె్టంబర్‌ 14న ప్రధాని మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబేలు బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. డిజైన్‌ స్పీడ్‌ గంటకు 350 కి.మీ కాగా ఆపరేటింగ్‌ స్పీడ్‌ గంటకు 320 కి.మీ ఉంటుంది. ఆధునిక డిజైన్, మల్టి–మోడల్‌ ఇంటిగ్రేషన్‌ (మెట్రో, బస్సు, రైలు, బుల్లెట్‌ రైలు ప్రయాణాలను అనుసంధానించే) అధునాతన వసతులతో 12 స్టేషన్లు నిర్మీస్తున్నారు. సబర్మతిలో మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌ను భారీ ఎత్తున నిర్మీంచారు.

వచ్చే ఏడాది ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. తొమ్మిది అంతస్తుల్లో నిర్మీంచిన ఈ హబ్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్, వివిధ ఆఫీసులతో ప్రయాణికులకు విందు, వినోదాలకు సకల వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ హబ్‌ నిర్మాణం పూర్తయింది. హెరిటేజ్‌ సిటీ అహ్మదాబాద్‌ సంస్కృతి, దేశ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా హబ్‌ను డిజైన్‌ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)