Breaking News

ఆ‘పాత’ నావ

Published on Fri, 02/28/2025 - 06:23

ఇదేమిటో తెలుసా? అలనాటి భారతీయ నౌకా పాటవానికి నిదర్శనం. వేల ఏళ్ల క్రితమే సముద్రాలపై రాజ్యం చేసిన వైనానికి తిరుగులేని గుర్తు. ఐదో శతాబ్దం దాకా సముద్రాలపై భారతీయులకు ఆధిపత్యం కట్టబెట్టిన విశాలమైన నావలివి. ఇనుము వాడకుండా కేవలం కలప దుంగలు, చెక్క, తాళ్లు తదితరాలతో వీటిని తయారు చేసేవారు. అయినా ఇవి అత్యంత ప్రతికూల వాతావరణాలను కూడా తట్టుకుంటూ సదూర సముద్రయానాలకు ఎంతో అనువుగా ఉండేవి. 

ఈ భారతీయ నావలకు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా యమ గిరాకీ ఉండేదట. ఇంతటి చరిత్ర ఉన్న పురాతన భారతీయ నావకు వాయుసేన, కేంద్ర సాంస్కృతిక శాఖ ఇప్పుడిలా ప్రాణం పోశాయి. వారి ఆలోచనలకు రూపమిస్తూ గోవాకు చెందిన నౌకా నిర్మాణ సంస్థ హోడీ ఇన్నొవేషన్స్‌ అచ్చం అలనాటి విధానంలోనే దీన్ని రూపొందించింది. బాబు శంకరన్‌ సారథ్యంలో కేరళకు చెందిన నిపుణులైన పనివాళ్లు అహోరాత్రాలు శ్రమించి దీన్ని పూర్తి చేశారు. 

అప్పట్లో మాదిరిగానే ఈ నావను ముందుగా రెండు అర్ధ భాగాలుగా నిర్మించారు. తర్వాత కొబ్బరి నార నుంచి అల్లిన తాళ్ల సాయంతో ఒడుపుగా ఒక్కటిగా బిగించారు. సముద్ర జలాల్లో తడిసి పాడవకుండా నావ అడుగు, పక్క భాగాలకు అప్పటి పద్ధతుల్లోనే సార్డిన్‌ ఆయిల్‌ తదితరాలతో పూత పూశారు. మన్నిక కోసం టేకు, పనస వంటి చెక్కలు మాత్రమే వాడారు. 

ఈ తరహా భారతీయ నావల హవా క్రీస్తుశకం ఐదో శతాబ్ది దాకా ప్రపంచమంతటా నిరి్నరోధంగా సాగింది. ఆ ఘన వారసత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో ఇదో ముందడుగని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆ‘పాత’నావకు ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. ఇది బుధవారం ఘనంగా జలప్రవేశం చేసింది. ఈ ఏడాది చివర్లో 15 మంది నేవీ అధికారులతో ప్రాచీన సముద్ర మార్గాల్లో ఈ నావ మస్కట్, ఇండొనేసియాలకు తొలి ప్రయాణం ప్రారంభించనుంది. దీన్ని నడిపే విధానం తదితరాలపై వారు ముందస్తు శిక్షణ కూడా పొందనున్నారు. 
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Videos

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)