Breaking News

పాక్‌ ప్రతినిధికి చుక్కలు చూపించిన భారత్‌

Published on Sat, 05/24/2025 - 08:59

న్యూయార్క్‌: దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్‌ చుక్కలు చూపిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ తీరును ప్రపంచ వేదికలపై భారత్‌ ప్రశ్నిస్తూ.. దాయాదిని ఇరుకునపెడుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితిలో పాక్‌ రాయబారి అ‌సిమ్‌ ఇఫ్తికర్‌ అహ్మద్‌ మరోసారి కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. అంతటితో ఆగకుండా.. ఇటీవల భారత్‌, పాకిస్తాన్‌ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది.

ఐక్యరాజ్యసమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్‌ రాయబారి పై వ్యాఖ్యలు చేశారు. అనంతరం, ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌.. పాకిస్తాన్‌కు కౌంటరిచ్చారు. హరీశ్‌ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదులకు, పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్తాన్‌కు ప్రజల ప్రాణాలను రక్షించడం గురించి మాట్లాడే అర్హత లేదు. పాక్‌‌ ప్రతినిధి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. భారత్‌ దశాబ్దాలుగా పాక్‌ ప్రాయోజిత ఉగ్రవాదులతో పోరాడుతోంది.

26/11 ముంబై దాడుల నుంచి ఇటీవల పహల్గాంలో అమాయక పర్యాటకులపై  ఉగ్ర దాడులు చేశారు. పౌరులే ప్రధాన లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను నిర్వహించి పాక్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో మృతిచెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆ దేశ సీనియర్‌ ప్రభుత్వ, పోలీసు, సైనిక అధికారులు హాజరై నివాళులర్పించడం చూశాం. ఉగ్రవాదులు, పౌరుల మధ్య తేడాను గుర్తించని ఆ దేశానికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. భారత పౌరులే లక్ష్యంగా పాక్‌ దాడులు చేసింది. గురుద్వారాలు, దేవాలయాలు, సైనిక స్థావరాలను కావాలనే లక్ష్యంగా చేసుకుంది. ఇలాంటి పనులు చేస్తూ బోధనలు చేయడం హాస్యాస్పదం అంటూ చురకలు అంటించారు.

భారత్‌ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది.  65 సంవత్సరాల క్రితం సింధు జల ఒప్పందంలోకి చిత్తశుద్ధితో ప్రవేశించింది. ఒప్పందంపై స్పూర్తితో, స్నేహ భావంతోనే ఇన్ని రోజులు ఉంది. ఆరున్నర దశాబ్దాలుగా భారత్‌పై పాకిస్తాన్‌ మూడు యుద్ధాలు చేసింది. ఉగ్రదాడులకు పాల్పడింది. సింధు జలాల ఒప్పందం స్పూర్తిని ఉల్లంఘించింది. నాలుగు దశాబ్దాలలో 20,000 మందికి పైగా భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించారు అని చెప్పుకొచ్చారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)