Breaking News

స్వామి నారాయణ్‌  ఆలయంపై...విద్వేష దాడి 

Published on Mon, 03/10/2025 - 06:29

న్యూయార్క్‌/న్యూఢిల్లీ: అమెరికాలో హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దుండగులు రెచ్చిపోతున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్‌ బెర్నార్డినో కౌంటీలో ఉన్న చినో హిల్స్‌లోని ప్రఖ్యాత స్వామి నారాయణ్‌ మందిరంపై శనివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. గ్రాఫిటీ రాతలతో అందవిహీనంగా మార్చే ప్రయత్నం చేశారు. 

ఇది ఖలిస్తానీల పనేనని భావిస్తున్నారు. చినో హిల్స్‌  లాస్‌ ఏంజెలెస్‌ కౌంటీకి సరిహద్దులోనే ఉంది. ఆలయాన్ని అపవిత్రం చేశారని బోచాసన్వాసి అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) ఆవేదన వెలిబుచ్చింది. ‘‘ఆలయాలపై విద్వేషాన్ని హిందూ సమాజం గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ విద్వేషాల వ్యాప్తిని చినో హిల్స్, దక్షిణ కాలిఫోర్నియాలోని హిందువులు కలసికట్టుగా అడ్డుకుంటారు’’ అని ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. ఈ ఘటనపై హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి దుండగులను కఠినంగా శిక్షించాలని ఎఫ్‌బీఐని, దాని డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ను కోరింది. 

ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అమెరికా ప్రభుత్వానికి కోవలిషన్‌ ఆఫ్‌ హిందూస్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (కోహ్న) విజ్ఞప్తి చేసింది. ‘‘అమెరికాలో హిందువులపై ద్వేషభావం లేదని మీడియా, మేధావులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. లాస్‌ ఏంజెలెస్‌లో ఖలిస్తాన్‌ రెఫరెండం పేరిట కొందరు డ్రామాలుడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో స్వామి నారాయణ్‌పై ఆలయంపై దాడి ఆశ్చర్యం కలిగించలేదు’’ అని పేర్కొంది. కొన్నేళ్లలో అమెరికాలో 10 హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని ఆవేదన వెలిబుచ్చింది. గతేడాది కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో, న్యూయార్క్‌లోని మెల్‌వీల్లేలో ఆలయాలపై దాడులు జరిగాయి. ‘హిందూస్‌ గో బ్యాక్‌’ అంటూ ఆలయాల గోడలపై రాతలు రాశారు.

భారత్‌ ఖండన 
స్వామి నారాయణ్‌ ఆలయంపై దాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని  విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్‌ జైశ్వాల్‌ ఆదివారం డిమాండ్‌ చేశారు. అమెరికాలోని హిందూ దేవాలయాలకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. స్వామి నారాయణ్‌ ఆలయాన్ని అపవిత్రం చేయడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. ఆలయాలపై అసహనం, విద్వేష చర్యలు అంగీకారయోగ్యం కాదని పేర్కొంది. దుండగులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. దాడిని యోగా గురు రాందేవ్‌ ఖండించారు.
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)