Breaking News

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌పై అభిశంసన!

Published on Mon, 08/18/2025 - 11:38

న్యూఢిల్లీ: ఓట్ల చోరీ విషయంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమైన ఇండియా కూటమి.. మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ Gyanesh Kumarపై అభిశంసనకు నోటీసులు ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తాజాగా.. ఓట్ల చోరీ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని, లేకుంటే దేశానికి క్షమాపణలు చెప్పాలని రాహుల్‌ గాంధీకి సీఈసీ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. 

లోక్‌సభ ఎన్నికలు, తదనంతరం జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో.. ఓట్ల దొంగతనం జరిగిందని, లక్షల కొద్దీ ఓట్ల తొలగింపు ద్వారా బీహార్‌లోనూ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, తేజస్వి యాదవ్‌ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో.. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఘాటుగానే బదులిస్తోంది. తాజాగా సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మరీ విపక్షాల ఆరోపణలను తిప్పి కొట్టారు. 

వారం రోజుల్లో ఆరోపణలపై అఫిడవిట్‌ను సమర్పించాలని, లేకపోతే ఆరోపణలకుగానే పరిగణించి తదుపరి చర్యలకు వెళ్తామని.. లేకుంటే దేశానికి క్షమాపణలు చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అన్నారు. 

అయితే సోమవారం పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభానికి ముందు.. సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఉపరాష్ట్రపతి అభ్యర్థి గురించి చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే ఆఫీస్‌లో భేటీ అయ్యారు.  ఈ క్రమంలో సీఈసీపై అభిశంసన అంశం ప్రస్తావనకు వచ్చినట్లు పలు జాతీయ మీడియా చానెల్స్‌ కథనాలు ఇచ్చాయి. అయితే.. 

ఈ భేటీ అనంతరం కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భేటీలో అలాంటిదేం ప్రస్తావనకు రాలేదన్నారు. ఒకవేళ అలాంటి అవసరమే పడితే.. కచ్చితంగా చేస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా మాకున్న అన్ని ఆయుధాలను ప్రయోగిస్తాం’’ అని స్పష్టత ఇచ్చారాయాన. 

ఇదిలా ఉంటే.. సీఈసీ అనే రాజ్యాంగ హోదా ప్రతిష్టను జ్ఞానేష్‌ కుమార్‌  దిగజారుస్తున్నాడనంటూ విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో ఇవాళ ఆందోళనకు దిగాయి. బీజేపీకి సీఈసీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. దీంతో.. ఇండియా కూటమి సీఈసీపై అభిశంసన నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లే కనిపిస్తోంది.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)