Breaking News

ఈసీ అక్రమాలపై ఇండియా కూటమి సమరశంఖం.. ‘చలో ఢిల్లీ’ మహా గర్జన!

Published on Sun, 11/01/2026 - 16:07

సాక్షి,న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు భారీ చలో ఢిల్లీ ర్యాలీ నిర్వహిస్తున్నాయి.

సెంట్రల్ ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కొనసాగుతున్న ఈ భారీ నిరసన సభలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఎం నేత ఎం.ఏ. బేబీ, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ సహా ఇరత ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం తన స్వతంత్రతను కోల్పోయి బీజేపీ ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పేరుతో దేశంలోని అర్హులైన పౌరుల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంలోని ఇతర కమిషనర్ల అభిప్రాయాలను సైతం ప్రధాన ఎన్నికల కమిషనర్ పరిగణనలోకి తీసుకోవడం లేదని స్వయంగా కమిషనర్లు పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అన్నారు.
‎
‎ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన ‘చలో ఢిల్లీ – ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీకి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గత ఐదారేళ్లుగా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాలో అక్రమాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. తొలుత కొందరు ఈ అంశాన్ని రాజకీయ విమర్శగా భావించినప్పటికీ, ఇప్పుడు ఎన్నికల సంఘంలోని సభ్యుల నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా కాకుండా తన స్వతంత్ర నిర్ణయాలతో పనిచేయాలని స్పష్టం చేశారు.
‎
‎భారత రాజ్యాంగం ప్రతి అర్హత కలిగిన పౌరుడికి సమానమైన ఓటు హక్కును కల్పించిందని, ఆ హక్కును హరించడమంటే ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీయడమేనని భట్టి విక్రమార్క అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారని, ఎంతోమంది మహనీయుల కృషి ఫలితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించారని గుర్తుచేశారు.
‎
‎ఖర్గే, రాహుల్ గాంధీల పిలుపుతో నిర్వహించిన ఈ మహా ర్యాలీ చారిత్రాత్మకమని, ప్రతి పౌరుడికి తన ఓటు హక్కును కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం సాగుతోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
‎
‎ప్రతి నియోజకవర్గంలో సుమారు 20 వేల నుంచి 25 వేల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. అయినప్పటికీ, 40 వేల నుంచి 60 వేల మెజారిటీ ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారని, ఓట్ల తొలగింపు జరగకపోయి ఉంటే మెజారిటీ మరింత ఎక్కువగా ఉండేదని వివరించారు. సాధారణంగా ఎన్నికల్లో గెలుపొందిన, ఓడిపోయిన అభ్యర్థుల మధ్య 10 వేల నుంచి 20 వేల ఓట్ల వ్యత్యాసమే ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో 20 వేల నుంచి 25 వేల ఓట్ల తొలగింపు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)