Breaking News

ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై కాంగ్రెస్‌ కసరత్తు

Published on Mon, 08/11/2025 - 05:05

సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌ కసరత్తు ప్రారంభించింది. విపక్షాలకు చెందిన ‘ఇండియా’కూటమి తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతు న్నారు. ఈ మేరకు గత గురువారం కూటమి నేతలతో ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం.

 ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కోసం నేతలతో విస్త్రృతం చర్చలు కొనసా గిస్తున్నారు. కాగా, నేడు సోమవారం రాత్రి ఢిల్లీ లోని హోటల్‌ తాజ్‌లో కూటమి పార్టీల పార్లమెంటు సభ్యులకు ఖర్గే విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించి వారి అభిప్రాయాలను తీసుకుంటారు. అయితే, ఎన్డీఏ తన అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే విపక్షాల అభర్థిని ప్రకటించాలని ఇండియా కూటమిలోని ఒక వర్గం ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  

బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు ఉభయసభల్లో 422 మంది, విపక్ష (ఇండియా) కూటమికి 313 మంది అనుకూలంగా ఉన్నారు. ఎన్‌డీఏ అభ్యర్థి విజయం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది. అయినా ఉభయ సభల్లో మెజారిటీ లేనప్పటికీ ఉప రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేయాని, బలం లేకున్నా బరిలో ఉండాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఫలితంతో సంబంధం లేకుండా బలమైన సందేశాన్ని పంపే ఉద్దేశంతోనే ఇండియా కూటమి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి అభర్థిని నిలబెట్టడంపై సమష్టి నిర్ణయం కోసం ప్రయత్నా లు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)