Breaking News

బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన భారత్‌

Published on Sun, 06/29/2025 - 07:48

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ జనపనార, అనుబంధ ఉత్పత్తుల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చాయి. భూమార్గం, మహారాష్ట్రలోని నావ సేవా పోర్టు మినహా అన్ని నౌకాశ్రయాల ద్వారా వచ్చే వాటికి ఆంక్షలు వర్తిస్తాయి. ఈ మేరకు వాణిజ్య శాఖ పరిధిలోని ఫారిన్‌ ట్రేడ్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ శుక్రవారం ఒక నోటిఫికేషన్‌ జారీ చేశారు. బంగ్లాదేశ్‌తో సంబంధాల్లో అగాధం పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం సంభవించడం గమనార్హం.

దక్షిణాసియా వాణిజ్య స్వేచ్ఛా ప్రాంత(సాఫ్టా) నిబంధనల ప్రకారం బంగ్లా నుంచి వచ్చే జనపనార దిగుమతులపై భారత్‌లో ఇప్పటి వరకు ఎలాంటి పన్నులూ లేవు. ఇది దేశీయ జూట్‌ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకే, ఇకపై బంగ్లాదేశ్‌ నుంచి దిగుమతయ్యే జనపనార, సంబంధిత ఉత్పత్తులపై యాంటీ డంపింగ్‌ డ్యూటీ(ఏడీడీ) విధించింది.

ఈ చర్య బంగ్లాదేశ్‌ దిగుమతులపై గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోయింది. పైపెచ్చు, బంగ్లాదేశ్‌ ఎగుమతిదారులు సాంకేతికపరమైన సాకులు చూపుతూ ఏడీడీ నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా విధించిన ఆంక్షలతో బంగ్లాదేశ్‌ జనపనార ఉత్పత్తుల నాణ్యత తనిఖీలను క్రమబదీ్ధకరించడం, తప్పుడు ప్రకటనలు, మోసపూరిత లేబులింగ్‌ను నివారించడం, మూడో దేశం ద్వారా చేసే దిగుమతులను నిలువరించేందుకు వీలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా దేశీయ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపాయి.   

#

Tags : 1

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)