Breaking News

ఉగ్ర పాక్‌కు నిధులు ఇవ్వొద్దు

Published on Tue, 05/06/2025 - 05:32

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌ ఆర్థిక మూలా లను దెబ్బకొట్టడంపై దృష్టిపెట్టిన భారత్‌ ఆ దిశగా ప్రయత్నాలు ఉధృతంచేసింది. పాకిస్తాన్‌కు వందల కోట్ల రూపాయల రుణాలు, ఆర్థిక సాయం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న అంతర్జాతీయ సంస్థలు ఆ యత్నాలను మానుకోవాలని భారత్‌ అభ్యర్థిస్తోంది. ఇందులోభాగంగా సోమవారం ఇటలీలోని మిలాన్‌ సిటీలో ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) అధ్యక్షుడు మసాటో కందాతో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీ అయ్యారు. 

ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్తాన్‌కు ఆర్థికసాయం చేయడం మానుకోవాలని నిర్మల కోరారు. ఈ సందర్భంగా ఇటలీ ఆర్థిక మంత్రి జిన్‌కార్లో జార్జెట్టీతోనూ నిర్మల భేటీ అయ్యారు. నాలుగురోజులపాటు జరిగే ఏడీబీ 58వ వార్షిక సమావేశాలు ఆదివారం ఇటలీలో ప్రారంభమవడం తెల్సిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) సంస్థ వంటి బహుళజాతి సంఘాలు పాకిస్తాన్‌కు సాయంపై పునరాలోచన చేస్తే మంచిదని ఈ సందర్భంగా నిర్మల హితవు పలికారు. 

ప్రజాపనుల రుణాలు, సాంకేతిక సహకారానికి సంబంధించి మొత్తంగా 764 పనులకుగాను ఏకంగా 43.7 బిలియన్‌ డాలర్ల నిధులను పాక్‌కు ఇచ్చేందుకు ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నిర్ణయించడం తెల్సిందే. ఇప్పటికే 9.13 బిలియన్‌ డాలర్ల రుణాలిచ్చింది. నాలుగు నెలల క్రితం ప్రపంచ బ్యాంక్‌ సైతం పాకిస్తాన్‌కు 20 బిలియన్‌ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. మరోవైపు ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌)           గ్రే జాబితాలోకి పాకిస్తాన్‌కు చేర్చడానికి భారత్‌ తీవ్రంగా శ్రమిస్తోంది.  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)