Breaking News

వెండి, ఇత్తడి కళాకృతులు.. పెయింటింగ్‌లు

Published on Fri, 06/20/2025 - 05:27

న్యూఢిల్లీ: ఇతర దేశాల నేతలను కలిసినప్పు డు కానుకలు అందజేయడమనే ఆనవాయితీని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగి స్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం కెనడాలోని జరిగిన జీ7 శిఖరాగ్ర భేటీలో ఆయన పాల్గొనడం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన ఆతిథ్య దేశ ప్రధాని మార్క్‌ కార్నీతోపాటు ఆయా దేశాల నేతలకు కలకాలం గుర్తుండిపోయే, మన ఘన వారసత్వాన్ని ప్రతిబింబించే అద్భుత మైన కానుకల్ని అందజేశారు. వీటిలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇత్తడి, వెండి కళాకృతులతోపాటు ఆకర్షణీయమైన పెయింటింగ్‌లున్నాయి.
 
కెనడాలోని కననాస్కిస్‌లో జీ7 భేటీ సమయంలో ఆ దేశ ప్రధాని మార్క్‌ కార్నీకి ప్రధాని మోదీ ఇత్తడితో రూపొందించిన బోధి చెట్టు కళా ఖండాన్ని కానుకగా అందజేశారు. గౌతమబుద్ధునికి బోధి వృక్షం కిందనే జ్ఞానోదయమైన విషయం తెల్సిందే. జ్ఞానం, శాంతి, ఆధ్యాత్మిక మేల్కొలుపును ప్రతిబింబించేలా బిహార్‌ కళాకారులు రూ పొందించిన కళారూపమిది. అదేవిధంగా, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ కు తమిళనాడుకు చెందిన డోక్రా నిపుణులు రూపొందించిన నంది విగ్రహాన్ని బహూక రించారు. పరమ శివుని వాహనం నందీశ్వరుడు. సంప్రదాయ భారతీయ లోహ కళను చాటి చెప్పేలా ఈ విగ్రహం కనిపిస్తుంది. 

మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్‌బామ్‌ పర్డోకు సంప్రదాయ వర్లి కళాఖండాన్ని కానుకగా ఇచ్చారు. మహారాష్ట్రలోని వర్లి గిరిజనుల జానపద కళ ఇది. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌కు సంప్రదాయ మధుబని పెయింటింగ్‌ను అందజేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన డోక్రా కళాకృతిలో రూపుదిద్దుకున్న ఇత్తడి గుర్రం బొమ్మను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసాకు ప్రధాని మోదీ బహూకరించా రు. 

పురాతన సంప్రదాయ నైపుణ్యంతో గిరి జన చేతిపనివారు రూపొందించిన బొమ్మ ఇది. బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇన్సియో లులా డ సిల్వాకు వెదురుతో తయారు చేసిన హంస ఆకారంలోని పడవ బొమ్మను అందజేశారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు కల్హాపురి వెండి పాత్రను బహుమతిగా ఇచ్చారు. స్వచ్ఛమైన వెండితో తయారైన ఈ పాత్రపై చేతిలో రూపొందించిన పూల నగిషీలున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఈ కళాకృతి అందంతోపాటు ఘన వారసత్వాన్ని చాటుతోంది. జర్మనీ చాన్సెలర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌కు పాలరాతి తో రూపొందించిన సూర్య దేవాలయాన్ని గుర్తుకు తెచ్చే కోణార్క్‌ చక్రం బొమ్మను బహుమతిగా ఇచ్చారు ప్రధాని మోదీ.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)