Breaking News

సింహానికి చిట్టెలుకకు పోలికా?.. భారత్‌, పాక్‌ బలాబలాలు ఇలా..

Published on Fri, 04/25/2025 - 10:21

డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ఎదురుగా తొడగొట్టిందట.. గట్టిగా యాభై కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు మిలిటరీ వాహనాలకు డీజిల్ పోయలేరు.. ఒకసారి ఫైటర్ జెట్లను ట్రయల్ రన్ తీయాలంటే లక్షలు ఖర్చు.. దానికి చేతగాదు.. యుద్ధ ట్రయాంకర్లకు ఆయుధాలు.. వంటివి ఫిక్స్ చేయాలంటే నట్లు .. బోల్టులు కరువే.. అసలు సైనికులకు యూనిఫారాలు. బూట్లు కూడా కొత్తవి ఇవ్వాలంటే పాతవాటికి మాసికాలు వేసుకుని రోజులీడుస్తున్న దారుణం. 

భారత్ నుంచి గోధుమపిండి ఇస్తే తప్ప మూడుపూటలూ ముద్దకు ఠికాణాలేని కరువు బతుకులు.. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు భారత్ కు సవాల్ విసురుతోంది. అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న విలువ, గౌరవం.. మార్కెట్ వాల్యూ.. సైనిక.. ఆర్థిక సంపత్తితో పోలిస్తే పాకిస్తాన్ ఒక పిపీలికం.. కానీ ఏదో తెగింపు.. దేశంలో పోతున్న పరువును కాపాడుకునేందుకు ఏదో  ఒక బిల్డప్ ఇస్తూ అక్కడి సైనిక పాలకులు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.. ఈ తరుణంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సైనిక  బలాలు.. బలగాల మధ్య ఏపాటి వ్యత్యాసం ఉందో చూద్దాం. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 తాజా నివేదిక ప్రకారం ఇరు దేశాల మిలిటరీ శక్తి ఇలా ఉంది

సమగ్ర మిలిటరీ ర్యాంకింగ్:
భారతదేశం: ప్రపంచంలో 4వ ర్యాంక్, పవర్ ఇండెక్స్: 0.1184

పాకిస్తాన్: ప్రపంచంలో 12వ ర్యాంక్, పవర్ ఇండెక్స్: 0.2513


మానవ వనరులు:

  • మొత్తం జనాభా: భారతదేశం – 1.4 బిలియన్ | పాకిస్తాన్ – 252 మిలియన్

  • యాక్టివ్ సైన్యం : భారతదేశం – 14,55,550 | పాకిస్తాన్ – 6,54,000

  • రిజర్వ్ సిబ్బంది: భారతదేశం – 11,55,000 | పాకిస్తాన్ – 5,50,000

  • పారా మిలిటరీ దళాలు: భారతదేశం – 25,27,000 | పాకిస్తాన్ – 5,00,000

వాయుసేన బలాబలాలు.. 

  • మొత్తం విమానాలు: భారతదేశం – 2,229 | పాకిస్తాన్ – 1,399

  • యుద్ధ విమానాలు: భారతదేశం – 513 | పాకిస్తాన్ – 328

  • ఎటాక్ హెలికాఫ్టర్లు :  భారతదేశం – 80 | పాకిస్తాన్ – 57

 

పదాతిదళం బలాబలాలు :

  • ట్యాంకులు: భారతదేశం – 4,201 | పాకిస్తాన్ – 2,627

  • ఆర్మర్డ్ వెహికల్స్: భారతదేశం – 1,48,594 | పాకిస్తాన్ – 17,516

  • మొబైల్ రాకెట్ వ్యవస్థలు: భారతదేశం – 264 | పాకిస్తాన్ – 600


నావికాబలం :

మొత్తం నేవీ స్థావరాలు.. కేంద్రాలు :  293 | పాకిస్తాన్ – 121

ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు: భారతదేశం – 2 | పాకిస్తాన్ – 0

జలాంతర్గాములు :  భారతదేశం – 18 | పాకిస్తాన్ – 8

డిస్ట్రాయర్స్: భారతదేశం – 13 | పాకిస్తాన్ – 0


రక్షణ ఖర్చు:

  • భారతదేశం: $75 బిలియన్

  • పాకిస్తాన్: $7.64 బిలియన్

ఇప్పుడు చెప్పండమ్మా.. ఎవరిది బలం.. ఎవరిది బలుపు.. గతంలో ఎన్నోసార్లు భారత్ మీదకు తెగబడి వారంరోజుల్లోనే చేతులెత్తేసి. మోకాళ్ళమీద నిలబడి శరణు వేడిన సందర్భాలు ఉన్నాయ్. బతికితే చాలు దేవుడా అంటూ పలాయనం చిత్తగించిన పాకీ సేనలు ఇప్పుడు మళ్ళీ ఏం చూసుకుని బోర్డర్లో సైనిక సన్నాహాలు చేస్తున్నాయో. తెగింపా.. తెంపరితనమా.. దేశంలో పరువుకాపాడుకునే క్రమంలో ఈ ఓవర్ యాక్టింగ్ అనివార్యమా.. ఏదైనా సరే.. భారత్ సేన ఒకసారి అడుగు ముందుకు వేస్తె అది పాక్ అంతు చూసేవరకూ ఆగేది లేదని భారత్ ప్రభుత్వం మరోసారి గట్టిగ్గా స్పష్టం చేసింది.
- సిమ్మాద్రిప్పన్న

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)