భారత్, మలేషియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం

Published on Wed, 08/21/2024 - 05:00

న్యూఢిల్లీ: భారత్, మలేషియా మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చుకొనే దిశగా మరో ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ,  మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం మంగళవారం ఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు నిర్వహించారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశారు. డిజిటల్‌ టెక్నాలజీతో సహకారంతోపాటు స్టార్టప్‌ వ్యవస్థ అనుసంధానానికి డిజిటల్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు. మలేషియాలోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ టుంకూ అబ్దుల్‌ రెహ్మాన్‌’లో ఆయుర్వేద విభాగాన్ని, యూనివర్సిటీ ఆఫ్‌ మలయాలో తిరువళ్లువర్‌ విభాగాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇబ్రహీం మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానిగా ఆయన తొలి భారత పర్యటన ఇదే కావడం విశేషం.

త్వరలో యూపీఐ, పేనెట్‌ అనుసంధానం: భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, మలేషియా మధ్య సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించామని తెలిపారు. సెమీకండక్టర్, ఫిన్‌టెక్, రక్షణ పరిశ్రమ, ఏఐ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకుంటే ఇరు దేశాలకు మేలని మోదీ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని అరికట్టడానికి ఉమ్మడిగా పోరాటం చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)