ఉత్తరాదిని వణికిస్తున్నవానలు

Published on Wed, 07/29/2026 - 05:31

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. హిమాలయ ప్రాంత రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకోగా, దేశ రాజధాని ఢిల్లీలో జన జీవనం స్తంభించింది. వచ్చే నాలుగైదు రోజుల్లోనూ ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌లలో భారీ వర్షాలు నమోదయ్యాయి. హిమాచల్‌లోని చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో వాహనాలు, నివాసాలు మట్టి, బురద, రాళ్లకింద కూరుకుపోయాయి.

అయితే, ప్రాణనష్టం సంభవించలేదు. ఉత్తరాఖండ్‌లో విడవకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఛార్‌ధామ్‌ యాత్రను రెండు రోజులపాటు నిలిపివేశారు. యాత్ర మార్గంలో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వరద నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఈ సీజన్‌లో అత్యధికంగా మంగళవారం వర్షం నమోదైందని, మూడేళ్లలోనే జూలైలో 29 డిగ్రీల సెల్సియస్‌తో అతి చల్లని రోజుగా మంగళవారం ఉందని ఐఎండీ తెలిపింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)