Breaking News

చలి తీవ్రత ఎక్కువే

Published on Tue, 12/02/2025 - 05:33

న్యూఢిల్లీ: డిసెంబర్‌ 2025– 2026 ఫిబ్రవరి వరకు మూడు నెలల సీజన్‌లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం తెలిపింది. మధ్య భారత, వాయవ్య ప్రాంతాలు, దక్షిణాదిన సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు, పశ్చిమ భారతంలో మాత్రం సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు ఉండొచ్చని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. 

రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌తోపాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో శీతల గాలుల ప్రభావం ఈసారి నాలుగైదు రోజులపాటు అదనంగా ఉంటుందని అంచనా వేశారు. సాధారణంగా డిసెంబర్‌– ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ ప్రాంతాల్లో ఆరు రోజులపాటు శీతల గాలులు వీస్తాయని మహాపాత్ర తెలిపారు. ఈ సీజన్‌లో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే తక్కువగానే ఉష్ణోగ్రతలుంటాయని పేర్కొన్నారు. నవంబర్‌8–18వ తేదీల మధ్య మొదటిసారి శీతల గాలుల ప్రభావం రాజస్తాన్, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిందన్నారు. అదేవిధంగా, ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు మధ్య, వాయవ్య ప్రాంతాల్లో శీతలగాలుల ప్రభావం ఉండొచ్చని వివరించారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?