Breaking News

గంజాయి కేసులో ఐఐటీ బాబా అరెస్ట్‌!

Published on Mon, 03/03/2025 - 17:14

జైపూర్‌: మహా కుంభమేళాతో దేశం దృష్టిని ఆకర్షించిన ఐఐటీ బాబా(IIT Baba) అభయ్‌ సింగ్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గంజాయి కేసులో తాజాగా ఆయన్ని జైపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.  ఈ విషయాన్ని స్వయంగా ఐఐటీ బాబానే ధృవీకరించడం విశేషం.  

ఐఐటీ బాబా సూసైడ్‌ చేసుకుంటానన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జైపూర్‌ షిప్రా పాథ్‌ పోలీసులు ఓ హోటల్‌లో ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లారు. ఆ టైంలో ఆయన నుంచి గంజాయి సేవిస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీన్నారు. ఆయనపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ &సైకోట్రోపిక్‌ సబ్‌స్టానెన్స్‌(NDPS) యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. 

అయితే.. ఆయన అరెస్ట్‌ ప్రచారం నడుమ అనూహ్యంగా ఆయన తన భక్తుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ కనిపించారు. దీంతో మీడియా ఆయన్ని అరెస్ట్‌పై ఆరా తీసింది. తాను ఆత్మహత్య చేసుకుంటానన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారాయన. అయితే తాను గంజాయి తీసుకున్న మాట వాస్తవమేనని.. అయితే పరిమితితో కూడి గంజాయి ఉండడంతో పోలీసులు బెయిల్‌ మీద తనను విడుదల చేశారని అన్నారాయన. అయితే తన దృష్టిలో అది గంజాయి కాదని.. ప్రసాదమని ఆయన వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉంటే.. ఓప్రైవేట్‌ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో తనపై దాడి జరిగిందంటూ నోయిడా పీఎస్‌ వద్ద ఐఐటీ బాబా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. చివరకు పోలీసులు ఆయన్ని శాంతపర్చి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఇంటర్వ్యూకు ముందు ఆయనే సదరు ఛానెల్‌ యాంకర్‌పై దాడి చేశారంటూ ప్రచారం జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు.

ఐఐటీ బాబాగా ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా(Prayagraj Maha Kumbh)  అభయ్‌ సింగ్‌ ఓ టీవీ  ఛానెల్‌ ఇంటర్వ్యూతో  పాపులారిటీ సంపాదించుకున్నారు. హర్యానా చెందిన అభయ్‌ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసినట్లు చెబుతున్నారు. కొంతకాలం ఓ కార్పొరేట్‌ సంస్థలో పనిచేసిన ఆయన.. దాన్ని వదిలేశారట. ఆపై కొంతకాలం ఫొటోగ్రఫీ.. అటు నుంచి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారట.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)