Breaking News

సవాల్‌ విసిరితే.. దేనికైనా సిద్ధమే: రాజ్‌నాథ్‌ సింగ్‌

Published on Thu, 03/07/2024 - 15:45

న్యూఢిల్లీ: భారత్‌- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్‌ కంట్రీకి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ . భారత్‌ ఇప్పటి వరకు ఏ దేశంపై దాడి చేయలేదని తెలిపిన కేంద్ర మంత్రి.. ఏ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోలేదని పేర్కొన్నారు. అదే ఒకవేళ ఏ దేశమైన భారత్‌కు సవాల్‌ విసిరితే.. తాము ధీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రక్షణమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఈ మేరకు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ‘ఢిఫెన్స్‌ సమ్మిట్‌’లో గురువారం రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్ల కాలంలో భారత రక్షణ రంగంలో చోటుచేసుకున్న మార్పులను, అభివృద్ధి వంటి అంశాలపై సైతం చర్చించారు. భూమి, గగనతలం, సముద్రం నుంచి ఎవరైనా భారత్‌పై దాడికి దిగితే తమ బలగాలు ధీటుగా బదులిస్తాయని హెచ్చరించారు.

తాము ఏ దేశంపైనా దాడి చేయలేదని.. ఎవరి భూభాగాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదన్నారు. కానీ, ఎవరైనా తమపై కన్నెత్తి చూస్తే, తప్పించుకునే పరిస్థితి లేదన్నారు. భారత్‌పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే తగిన సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నామని చెప్పారు. 

2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, రక్షణ రంగానికి తాము ప్రాధాన్యత పెంచామని కేంద్రమంత్రి తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను (స్వయంశక్తి) ప్రోత్సహించామని, స్వదేశీ ఉత్పత్తితోపాటు రక్షణ పరికారల ఎగుమతి,  సైనిక ఆధునికీకరణపై దృష్టి సారించామని చెప్పారు.దీని వల్ల భారతదేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైందని పేర్కొన్నారు. 
చదవండి: విమానంలో సీట్ కుషనింగ్ మాయం! - ఏం జరిగిందంటే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)