Breaking News

రెండేళ్లలో 40 విల్లాలు, కాటేజీలు : ఐఏఎస్‌పై సంచలన ఆరోపణలు

Published on Fri, 10/30/2026 - 12:15

రాజస్థాన్‌ సీనియర్ ఐఏఎస్ అధికారి శిఖర్ అగర్వాల్‌కు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. శిఖర్ అగర్వాల్‌ను 'అవైటింగ్ పోస్టింగ్ ఆర్డర్' (APO) కింద  ఉంచుతూ  ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి  ఆదేశాలు జారీ చేసింది. ఆయన, ఆయన భార్య (ఐపీఎస్ అధికారి ప్రశాఖ మథుర్), వారి ఇద్దరు కుమారులు, అత్తమామలు కలిసి రెండున్నరేళ్ల కాలంలో ఒకే కంపెనీ నుంచి 40 విల్లాలు, కాటేజీలను కొనుగోలు చేశారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

బుధవారం అర్ధరాత్రి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, 1993 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అగర్వాల్‌ను పరిపాలనా కారణాల రీత్యా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు APO కింద ఉంచారు.   అగర్వాల్‌పై  ఆరోపణలకు సంబంధించిన వివరాలను ఒక స్థానిక పత్రిక బయటపెట్టడం సంచలనంగా మారింది. అయితే ఈ  ఆరోపణలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాస్, ముఖ్యమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి అఖిల్ అరోరా కూడా ఇంకా స్పందించలేదు.అలాగే   దీనిపై విచారణ లేదా అంతర్గత దర్యాప్తు ప్రారంభిస్తారా లేదా అనే దానిపై ఇంకా అధికారిక ధృవీకరణ ఏదీ రాలేదని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారులలో ఒకరైన అగర్వాల్, గతంలో సీఎంఓలో పనిచేశారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుధాంశు పంత్‌తో విభేదాలు వచ్చినట్లు వార్తలు రావడంతో ఆయనను సీఎంఓ నుంచి తొలగించారు. అధికారుల బదిలీలు, ఫైళ్లను పక్కన పెట్టడంపై వీరిద్దరి మధ్య నడిచిన వివాదం ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పంత్ కేంద్ర డెప్యుటేషన్‌కు వెళ్లడానికి ఇది కూడా ఒక కారణమని భావిస్తారు. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో ఏడో స్థానంలో ఉన్నప్పటికీ, 2027 ఫిబ్రవరిలో శ్రీనివాస్  రిటైర్మెంట్ తర్వాత ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడుతున్న వారిలో అగర్వాల్ ఒకరు. ఈ పోటీలో అభయ్ కుమార్, అఖిల్ అరోరా, అపర్ణ అరోరా ఉండగా, మరో పోటీదారు రజత్ కుమార్ మిశ్రా ప్రస్తుతం కేంద్ర డెప్యుటేషన్‌లో ఉన్నారు.

ఇదీ చదవండి: 15 అడుగుల గోతిలో 3 బ్లూ డ్రమ్ముల్లో కోట్ల కొద్దీ డబ్బు

కాగా అగర్వాల్ పరిశ్రమలు, MSME, ప్రణాళిక, ఇతర శాఖల అదనపు ముఖ్య కార్యదర్శి (ACS)గా  ఉండగా, అంతకుముందు రాజస్థాన్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడి సంస్థ (RIICO) ఛైర్మన్‌గా, RAJSICO మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

ఇదీ చదవండి: షేక్ హసీనా వీడియో : ఆ అధికారి అనుమానాస్పద మృతి కలకలం


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)