Breaking News

బిహారీనని చెప్పుకోవడం గర్వకారణం

Published on Sun, 11/02/2025 - 05:57

పాట్నా: బిహారీగా ఉండడం, బిహారీనని చెప్పుకోవడం ఇప్పుడు గర్వకారణమని బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే మరోసారి ఎన్డీయేను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ మేరకు నితీశ్‌ కుమార్‌ శనివారం సోషల్‌ మీడియాలో ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తాను అధికారంలో ఉన్నప్పటికీ తన కుటుంబం కోసం ఏమీ చేయలేదని, ఎల్లప్పుడూ రాష్ట్ర అభివృద్ధి కోసమే కృషి చేశానని తెలిపారు. 

బిహార్‌ ప్రగతే ధ్యేయమని స్పష్టంచేశారు. 2005 నవంబర్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తమ పాలనలో శాంతి భద్రతలు చాలావరకు మెరుగుపడ్డాయని వివరించారు. చట్టబద్ధ పాలన తీసుకొచ్చామని, ప్రజలు ఇప్పుడు తాము బిహారీలమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారని ఉద్ఘాటించారు. మహిళలు, హిందువులు, ఉన్నత కులాలు, దళితులు, వెనుకబడిన తరగతులు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టామని గుర్తుచేశారు.

 తాము మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించారు. ఆర్జేడీకి అధికారం అప్పగిస్తే అరాచయ పాలన వస్తుందని నితీశ్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. తమకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ‘వికసిత్‌ బిహార్‌’ తమ ధ్యేయమని అన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా మారుస్తామని హామీ ఇచ్చారు. బిహార్‌లో ఈ నెల 6, 11న అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.  
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)