Breaking News

‘సుశాంత్‌ కేసు క్లోజ్‌.. రియాకు ఇదే నా శాల్యూట్‌..’!

Published on Sun, 03/23/2025 - 19:17

ముంబై: సుమారు ఐదేళ్ల క్రితం బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ మృతి కేసు పెద్ద సంచలనం. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడానికి  గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తినే కారణమంటూ పెద్ద దుమారమే చెలరేగింది. 2020, జూన్‌ 14వ తేదీన సుశాంత్‌ బాంద్రాలోని తన నివాసంలో విగతజీవిలా పడివున్నాడు. మెడకు ఉరి వేసుకుని ఉన్న సుశాంత్‌ మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి. దీనిపై దాదాపు ఐదేళ్ల పాటు విచారణ జరిపిన సీబీఐ.. ఎట్టకేలకు తుది రిపోర్ట్‌ ఇచ్చింది. సుశాంత్‌ మరణం వెనుక ఎవరి ప్రేరేపితం లేదని స్పష్టం చేసింది. అంటే ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియాకు భారీ ఊరట లభించినట్లయ్యింది.

అయితే దీనిపై రియా లాయర్‌ సతీష్‌ మనీషిండే మాట్లాడుతూ..‘ ఈ కేసులో ప్రతీకోణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తుది నివేదికను ఇచ్చిన సీబీఐకి కృతజ్ఞతలు.  అటు ఎలక్ట్రానిక్‌ మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో కూడా రియాపై అనేక రకాలైన తప్పుడు కథనాలు వచ్చాయి. అది కోవిడ్‌ వచ్చిన సమయం కావడంతో ప్రతీ ఒక్కరూ టీవీలు, సోషల్‌ మీడియాను ఎక్కువ  చూశారు. ఈ క్రమంలోనే రియాపై ఎన్నో తప్పుడు వార్తలు చుట్టుముట్టాయి. నిరాధారమైన ఆరోపణలతో ఆమెను, ఆమె కుటుంబాన్ని నానా యాగీ చేశారు.  ఈ రకంగా చేయడం వల్ల అమాయకులు చాలా నష్టపోతారు. కానీ చివరకు రియా పాత్ర ఏమీ లేదని క్లియరెన్స్‌ వచ్చింది. ఇక్కడ రియాకు సెల్యూట్‌ చేస్తున్నా. ఎన్నో అవమానాలను భరించి ఎటువంటి నోరు విప్పకుండా మౌనం పాటించిన రియాకు, ఆమె కుటుంబానికి సెల్యూట్‌ చేస్తున్నా’ అని రియా లాయర్‌ సతీష్‌ మనీషిండే తెలిపారు.

సీబీఐ రిపోర్ట్‌లో ఏం చెప్పింది..?
సుశాంత్ మరణానికి సంబంధించి నమోదైన రెండు కేసుల్లో ఎవరి పాత్ర లేదని తెలిపింది. ఈ మేరకు ముంబై కోర్టులో సీబీఐ క్లోజర్‌ రిపోర్ట్‌ను దాఖలు చేసింది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మరణం వెనుకు ఎవరి పాత్ర లేదని,  ఎటువంటి కుట్రలు జరగలేదని తెలిపింది.  సుశాంత్‌ మరణంలో నటి రియా, ఆమె కుటుంబ సభ్యుల పాత్ర లేదని పేర్కొంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)