Breaking News

కోల్‌కతా వైద్యురాలి కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Published on Mon, 11/04/2024 - 20:41

కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్‌ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన సంజయ్‌ రాయ్‌.. తాను నిర్ధొషినని చెబుతున్నాడు. జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్య చేయలేదని, ప్రభుత్వం కావాలనే తనను ఇరికిస్తుందని ఆరోపించాడు. తన మాట ఎవరూ వినడం లేదని, పోలీస్‌ అధికారులు తనను భయపెడుతున్నారని తెలిపాడు.

కాగా నిందితుడు సంజయ్‌రాయ్‌ను సోమవారం సీబీఐ అధికారులు సీల్డా కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తరువాత కోర్టునుంచి వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళ్తుండగా.. వ్యాన్‌లో నుంచే మీడియాతో మాట్లాడాడు సంజయ్‌ రాయ్‌. నేను ఏ నేరం చేయలేదంటూ గట్టిగా కేకలు వేస్తూ చెప్పాడు.  ప్రభుత్వం తనను ఇరికించి నోరు విప్పకుండా బెదిరిస్తోందన్నారు.

మరోవైపు ఆర్జీకర్‌ ఆసుపత్రి ఘటనపై కోల్‌కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్‌ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వీరికి మహిళలు కూడా మద్దతు తెలిపారు. భారీగా ర్యాలీ నిర్వహించారు.  ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పలువురి అరెస్ట్‌ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఎనభై ఏడు రోజుల తర్వాత కోల్‌కతా కోర్టు సోమవారం ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై అభియోగాలు మోపింది. ఈ కేసులో రోజువారీ విచారణ నవంబర్ 11 నుంచి ప్రారంభమవుతుందని కోర్టు వెల్లడించింది. రాయ్‌పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (అత్యాచారం), సెక్షన్ 66 (మరణానికి కారణమైనందుకు),  103 (హత్యకు శిక్ష) కింద కేసు నమోదైంది.

 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)