Breaking News

నేనూ సైన్యంలో చేరతా

Published on Mon, 05/12/2025 - 05:31

ఝున్‌ఝును: పెద్దయిన తరువాత తానూ సైన్యంలో చేరతానని, తన తండ్రి ప్రాణాలు తీసిన పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని పాక్‌ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడు సురేంద్ర సింగ్‌ మోగా కూతురు వర్తిక ప్రతిజ్ఞ చేసింది. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ శనివారం జరిపిన డ్రోన్‌ దాడుల్లో జమ్మూ కశ్మీర్‌లోని ఉద్ధంపూర్‌ వైమానిక స్థావరంలో విధులు నిర్వహిస్తున్న రాజస్థాన్‌కు చెందిన జవాను సురేంద్ర సింగ్‌ మోగాతోపాటు బీఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. 

పాక్‌ డ్రోన్‌ శకలం ఢీకొని సురేంద్ర మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ‘‘శనివారం రాత్రి 9 గంటలకు కూడా నాన్నతో మాట్లాడా. ఆకాశంలో పాక్‌ డ్రోన్లు తిరుగుతున్నాయని, తాము బాగానే ఉన్నామని నాతో చెప్పాడు. అంతలోనే ఇలా జరిగింది’’ అంటూ 11 ఏళ్ల వర్తిక విలపించింది. తన తండ్రి దేశాన్ని కాపాడుతూ అమరుడైనందుకు గర్వంగా ఉందని చెప్పింది. పాక్‌ పేరు కూడా వినపడని రీతిలో అంతం కావాలని ఆకాంక్షించింది. ‘‘నా తండ్రి ప్రాణా లు తీసిన పాక్‌ను వదలను. సైన్యంలో చేరి వాళ్లను ఒకరి తర్వాత ఒకరిగా ఖతం చేస్తా’’ అని చెప్పింది. 

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు 
బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న సురేంద్రకు నాలుగు రోజుల కిందట సరిహద్దుకు రావాలని పిలుపు వచి్చంది. దీంతో తన భార్య, 11 ఏళ్ల వర్తిక, 7 ఏళ్ల కొడుకు ద„Š ను స్వస్థలమైన రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా మెహ్రదాసికి పంపించాడు. అంనతరం తాను ఉద్ధంపూర్‌కు బయల్దేరి వెళ్లాడు. అయితే ఊర్లోని కొత్త ఇల్లు గృహప్రవేశానికి వస్తాడనుకున్న కొడుకు.. త్రివర్ణ పతకాన్ని కప్పుకొని నిర్జీవంగా రావడంతో సురేంద్ర తల్లి కుప్పకూలిపోయింది. ధైర్యవంతుడైన సురేంద్రకు వీడ్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. గ్రామంలో నెలకొన్న ఉద్విగ్నభరిత వాతావరణంలో, ఆదివారం అధికారిక లాంఛనాలతో సురేంద్ర అంత్యక్రియలు పూర్తయ్యాయి.  
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)