Breaking News

ఆ క్షణంలోనే చనిపోయేవాడిని.. అందుకే బ‌తికున్నా..

Published on Fri, 04/25/2025 - 20:05

''నేను నా కుమారుడి గురించి, అతడు చేసిన‌ షహాదత్ (త్యాగం) కార‌ణంగా గర్వపడుతున్నాను. ఆ గర్వం వల్లనే నేను బతికి ఉన్నాను. లేకపోతే నా కుమారుడి నిర్జీవ శరీరాన్ని చూసిన క్షణంలోనే చనిపోయేవాడిని'' - ఈ మాట‌లు అన్న‌ది ప‌హ‌ల్‌గావ్‌కు చెందిన సయ్యద్ హైదర్ షా. మంగ‌ళ‌వారం నాటి ముష్క‌ర‌మూక దాడిలో త‌న పెద్ద కుమారుడిని ఆయ‌న కోల్పోయారు. కుటుంబ పోష‌కుడిగా ఉన్న కొడుకు ఉగ్ర‌వాదుల తూటాల‌కు బ‌లైపోవ‌డంతో హైదర్ షా కుటుంబం దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ప‌డిపోయింది. ఇంత‌టి విషాదంలోనూ కొడుకు చేసిన త్యాగాన్ని హైదర్ షా ప‌దేప‌దే త‌ల‌చుకుంటున్నారు.

జమ్మూక‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా ప‌హ‌ల్‌గావ్ (Pahalgam) బైస‌ర‌న్ లోయ‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ప‌ర్యాట‌కుల‌పై ఉగ్ర‌వాదులు జ‌రిపిన మెరుపుదాడిలో 27 మంది అమాయ‌కులు అసువులు బాశారు. అయితే త‌న క‌ళ్లెదుటే ప‌ర్యాట‌కుల‌ను చంపుతుంటే హైదర్ షా కొడుకు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా చూస్తూ ఉండ‌లేక‌పోయాడు. ఉగ్ర‌వాదులను ఎదిరించి టూరిస్టుల ప్రాణాలు కాపాడాల‌నుకున్నాడు. కానీ ముష్క‌రుల తుపాకీ తూటాల‌కు అడ్డుగా నిల‌బ‌డి ప్రాణాలు కోల్పోయాడు.

రోజూ మాదిరిగానే ఆదిల్ ఆ రోజు ఉద‌యం ప‌నికి వెళ్లాడు. ప‌ర్యాట‌కుల‌ను గుర్రంపై ఎక్కించుకుని తీసుకెళ్ల‌డం అత‌డి ప‌ని. అయితే ఉగ్ర‌దాడి జ‌రిగిన వెంట‌నే మ‌ధ్యాహ్నం 3 గంట‌ల ప్రాంతంలో ఆదిల్ కుటుంబానికి ఈ వార్త తెలిసింది. వెంట‌నే వారు ఆదిల్ ఫోన్ చేశారు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్త‌క‌పోవ‌డంతో వారు భయాందోళ‌న‌తో స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు, అక్క‌డి నుంచి ఆస్ప‌త్రికి ప‌రుగులు పెట్టారు. త‌న‌ కుమారుడికి బుల్లెట్ గాయాల‌య్యాయ‌ని తెలిసి హైదర్ షా హ‌తాశుల‌య్యారు. "సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నా కుమారుడు ఆసుపత్రిలో ఉన్నాడ‌ని మాకు తెలిసింది. అతడి కోసం వెతుకుతున్న వ్యక్తులు ఈ సంఘటన గురించి నాకు సమాచారం అందించారు" అని హైదర్ గుర్తుచేసుకున్నారు. త‌న కొడుకు కొంత‌మంది ప్రాణాలు కాపాడి చనిపోయినందుకు గ‌ర్వప‌డుతున్నాన‌ని ఆయ‌న ఏఎన్ఐతో చెప్పారు.

మాకు దిక్కెవ‌రు?
త‌మ ఇంటికి మూలస్తంభంగా నిలిచిన కొడుకు అనూహ్యంగా చనిపోవ‌డంతో ఆదిల్ త‌ల్లి శోక‌సంద్రంలో ముగినిపోయింది. ఇప్పుడు త‌మను ఎవ‌రు పోషిస్తార‌ని అంటూ రోదిస్తోంది.  ''నా కుమారుడు రోజుకు 300 రూపాయిలు సంపాదించేవాడు. అత‌డు తెచ్చిన డ‌బ్బుల‌తో సాయంత్రం బియ్యం కొని, వంట చేసుకుని కలిసి తినేవాళ్ళం. ఇప్పుడు మాకు ఎవరు ఆహారం తెస్తారు? ఎవరు మందులు తెస్తారు?" అంటూ ఆదిల్ త‌ల్లి క‌న్నీరుమున్నీర‌వుతోంది. ప‌ర్యాట‌కుల‌ను ర‌క్షించే క్ర‌మంలో త‌న కొడుకు ప్రాణాలు ఫ‌ణంగా పెట్టాడ‌ని, వారు కూడా మన సోదరులేన‌ని అంటూ ఆమె మాన‌వ‌త్వాన్ని చాటారు.

శాశ్వ‌తంగా సెలవు..
ఇంటికి త్వ‌ర‌గా వ‌చ్చేస్తాన‌ని వెళ్లి ఉగ్ర‌దాడికి ఆదిల్ బ‌లైపోయాడ‌ని ఆదిల్ సోదరి రవిసా ఆవేద‌న చెందింది. ''త‌న‌కు ఆరోగ్యం బాలేదు. ఒక రోజు సెలవు తీసుకుంటానని చెప్పాడు. త్వ‌ర‌గా వ‌చ్చేస్తాన‌ని ప‌నికి వెళ్లాడు. కానీ అతడు తిరిగి రాలేదు. ఉగ్ర‌వాదుల నుంచి తుపాకీని లాక్కొని టూరిస్టుల‌ను కాపాడటానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. ఛాతీలో మూడు, గొంతులో ఒక బుల్లెట్ దిగింద‌''ని రవిసా రోదించింది.

చ‌దవండి: ప్రాణాలు కాపాడిన ఉప్పు

అండ‌గా ఉంటామ‌న్న అబ్దుల్లా
ప‌ర్యాట‌కుల‌ను ర‌క్షించేందుకు త‌న ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టిన ఆదిల్‌ను స్థానికులు రియ‌ల్‌ హీరోగా కొనియాడారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే విధంగా స్పందించారు. స్వ‌యంగా ఆదిల్ ఇంటికి వెళ్లి అత‌డి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. ఆదిల్ కుటుంబానికి అన్నివిధాలా అండ‌గా ఉంటామ‌ని భ‌రోసాయిచ్చారు. 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)