Breaking News

విషాదం: పారాగ్లైడింగ్‌ చేస్తూ హైదరాబాద్‌ టూరిస్టు మృతి

Published on Mon, 02/12/2024 - 09:30

తెలంగాణకు చెందిన ఓ టూరిస్టు పారాగ్లైడింగ్ చేస్తూ దుర్మరణం చెందారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి కారణమైన పారాగ్లైడింగ్ పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సేఫ్టీ బెల్ట్‌ను తనిఖీ చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన నవ్య(26)..మనాలి సమీపంలోని దోభీ గ్రామంలో పారాగ్లైడింగ్‌  చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందారు. టెన్డం ఫ్లైట్‌లో టేకాఫ్‌ అయిన నిమిషాలకే ఈ దుర్ఘటన జరిగింది. మానవ తప్పిందంగానే ప్రమాదం జరిగినట్లు పర్యాటకశాఖ అధికారులు పేర్కొన్నారు. పర్యాటకురాలి సేఫ్టీ బెల్ట్‌ను తనిఖీ చేయకుండానే అనుమంతించడంతో ప్రమాదం జరిగినట్లు తేలడంతో.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారాగ్లైడింగ్‌ పైలట్‌ను పోలీసులు అరెస్ఠ్‌ చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. 

టూరిజం అధికారిణి సునైనా శర్మ మాట్లాడుతూ.. మానవ తప్పిదమే ఈ దురదృష్టకర సంఘటనకు దారితీసి ఉండొచ్చని తెలిపారు. పారాగ్లైడింగ్‌ చేసిన ప్రదేశం, ఎక్విప్‌మెంట్‌కు అనుమతి ఉందని, పైలట్‌కు రిజిస్ట్రేషన్‌ ఉందన్నారు. వాతావరణ సమస్యలు సైతం లేవన్నారు. ఈ ప్రమాదంతో ప్రస్తుతం దోభీ పారాగ్లైడింగ్‌ను తాత్కాలికంగా నిషేధించినట్లుట్లు తెలిపారు. ఐపీసీ సెక్షన్‌ 336, 334 కింద పైలట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారిణి చెప్పారు. మృతిచెందిన టూరిస్టు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చదవండి: Hyderabad:చాక్లెట్‌ ప్రియులకు అలర్ట్‌.. డైరీ మిల్క్‌లో పురుగు..

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)