Breaking News

భర్త ఆర్థిక ఆధిపత్య ధోరణి... క్రూరత్వం కాదు: సుప్రీం

Published on Sat, 01/03/2026 - 07:52

న్యూఢిల్లీ: కేవలం భర్త ఆర్థికంగా ఆధిపత్య ధోరణి కనబరుస్తున్నాడనే కారణంగా దాన్ని వైవాహిక క్రూరత్వంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి సాకులతో క్రిమినల్‌ కేసులు వేసి వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. భర్త నుంచి కొంతకాలంగా దూరంగా ఉన్న ఓ మహిళ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. క్రూరత్వం, వరకట్న వేధింపుల ఆరోపణలతో భర్తపై పెట్టిన క్రిమినల్‌ కేసును కొట్టేసింది. 

సదరు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసేందుకు నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. ‘‘మాజీ భర్త తాను పంపిన డబ్బులను ఎలా ఖర్చు చేసిందీ లెక్కలడిగాడన్నది పిటిషనర్‌ అభియోగం. అంతే తప్ప బాధితురాలికి ఇతరేతరా ఏ విధమైన మానసిక, భౌతిక హానీ జరగలేదు. అలాంటప్పుడు కేవలం మాజీ భర్త ఆర్థిక ఆధిపత్య ధోరణి చూపడాన్ని క్రూరత్వంగా పరిగణించలేం. ఇలాంటి వైవాహిక వివాదాల కేసుల విచారణలో కోర్టులు అత్యంత జాగరూకంగా వ్యవహరించాలి. ఒకరకంగా ఇది భారత సమాజ తీరుతెన్నులకు అద్దం పట్టే అంశం. పురుషులు స్త్రీల ఆర్థిక విషయాలపైనా తమ పెత్తనమే సాగాలనుకుంటూ ఉంటారు’’అని తీర్పు రాసిన జస్టిస్‌ నాగరత్న గుర్తు చేశారు.  

 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)