Breaking News

చనిపోయిన భార్యపై ప్రేమతో..

Published on Sun, 10/06/2024 - 07:35

బ్రహ్మపూర్: భార్యాభర్తల బంధం విడదీయరానిదని అంటారు. ఆలుమగలులో ఏ ఒక్కరు దూరమైనా మరొకరు విలవిలలాడిపోతారు. ఒంటరితనానికి లోనవుతుంటారు. అయితే ఒడిశాలోని బ్రహ్మపూర్‌కు చెందిన ఓ భర్త తన భార్య చనిపోయాక, ఆమెను మరచిపోలేక చేసిన పనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో ప్రశాంత్ నాయక్(52) అనే వ్యాపారవేత్త భార్య కిరణ్ కరోనా కాలంలో మరణించారు. వారిద్దరికీ 1997లో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. ప్రశాంత్ తన భార్య దూరమవడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో ఆయన సిలికాన్‌ మెటీరియల్‌తో భార్య విగ్రహాన్ని తయారు చేయించాడు. దానిని తన డ్రాయింగ్ రూమ్‌లో ఉంచాడు. ప్రశాంత్ తన పెద్ద కూతురు  వివాహం సందర్భంగా ఆ సిలికాన్‌ విగ్రహానికి చీర, నగలు ధరింపజేశాడు.

ప్రశాంత్‌ కుమార్తె మెహక్ తన తల్లి విగ్రహాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. ప్రతీరోజూ ఆ విగ్రహానికి చీరలు, నగలు మారుస్తుంటుంది. మెహక్ ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది. ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తన భార్య తనతోనే ఉన్నట్లు అనిపిస్తుందని ప్రశాంత్ తెలిపారు. ఇంట్లో అమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని తన పిల్లలు కోరారని ప్రశాంత్ పేర్కొన్నారు.

బెంగళూరుకు చెందిన శిల్పి ఫైబర్, రబ్బరు, సిలికాన్ ఉపయోగించి  ఏడాదిపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇందుకోసం ప్రశాంత్‌ కుమార్‌ ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విగ్రహాన్ని  ప్రశాంత్‌ తన పెద్ద కుమార్తె పెళ్లికి ముందు ఇంటికి తీసుకువచ్చారు. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తమ తల్లి తమతోనే ఉన్నదనిపిస్తుందని ప్రశాంత్ పిల్లలు చెబుతుంటారు.

ఇది కూడా చదవండి: Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)