Breaking News

భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించిన భర్త

Published on Tue, 07/23/2024 - 11:25

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో వింత ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఇది సంచలనం సృష్టించింది. ఒక భర్త స్వయంగా తన భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించాడు. దీని వెనుక గల బాగోతం తెలిసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.

ఆ భర్త తన భార్య కోసం ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్నవారి సంబంధాలు చూసేవాడు. ఆమె తన భార్య అని వారికి తెలియకుండా ఆమెకు పెళ్లి జరిపించేవారు. తరువాత ఆమె అత్తవారింటికి వెళ్లి, అక్కడ నగదు, నగలు మూటగట్టుకుని, భర్త దగ్గరకు వచ్చేసేది. తరువాత వారిద్దరూ కలసి అ‍క్కడి నుంచి పరారయ్యేవారు. ఈ విధంగా సదరు భర్త ఆ భార్యకు మూడు పెళ్లిళ్లు చేశాడు. అయితే దొంగ వ్యవహారాలు ఎంతోకాలం దాగవన్నట్లు ఆ మహిళ పోలీసులకు పట్టుబడింది. తాము సాగిస్తున్న వ్యవహారాలన్నీ ఆమె పోలీసుల ముందు ఉంచింది.

ఈ ఉదంతం గురించి పోలీసులు  మీడియాకు తెలియజేస్తూ డబ్బు సంపాదనకు ఈ భార్యాభర్తలు జనాలను మోసం చేస్తుంటారన్నారు. భర్తే స్వయంగా భార్యకు పెళ్లి చేస్తూ, తాను ఆమెను సోదరుడినని పెళ్లివారిముందు నమ్మబలికేవాడు. ఆమెకు వివాహం జరిగిపించాక వారి ఇంటితో తిష్టవేసి, ఆ ఇంటిలోని నగదు, నగలను తస్కరించేవాడు. ఇందుకు ఆమె సహకారం అందించేంది. లేదంటే ఆమెనే చోరీకి పాల్పడి, భర్త దగ్గరకు వచ్చేసేది. ఈ భార్యాభర్తల వ్యవహారం అత్యంత విచిత్ర పరిస్థితుల్లో బయటపడింది.

ఖార్గోన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన కుమార్తె చాలా రోజులుగా కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కుమార్తె.. భర్తతో కలిసి దొంగ పెళ్లికూతురి  నాటకం ఆడుతోందని ఆమెకు తెలియదు. పోలీసులు విచారణ ప్రారంభించి, ఆ మహిళ అల్లుడిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు ఆ భార్యాభర్తలను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)