Breaking News

‘కర్వా చౌత్‌’ హామీని విస్మరించిన భర్తపై ఫిర్యాదు

Published on Mon, 10/21/2024 - 10:27

ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. పుట్టింటిలో ఉన్న ఒక మహిళకు ఆమె భర్త ‘కర్వా చౌత్‌’ వ్రతానికి ముందురోజు తన ఇంటికి తీసుకువెళానని హామీనిచ్చాడు. అయితే దానిని భర్త నెరవేర్చకపోవడంతో భార్య నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే మల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక యువతికి ఏడాది క్రితం మధురలో వివాహం జరిగింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెళ్లయిన నాలుగు నెలల వరకూ వారి కాపురం సవ్యంగానే సాగింది. ఆ తర్వాత ఆమెకు భర్త, అత్తమామల నుంచి వేధింపులు మొదలయ్యాయి.

దీనిని ఆమె వ్యతిరేకించడంతో అత్తామామలు ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో ఆమె రెండు నెలలుగా తన పుట్టింటిలోనే ఉంటోంది. అలాగే ఈ విషయమై బాధితురాలు ఆగ్రా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. ఈ నేపధ్యంలో భర్త కర్వా చౌత్‌ వ్రతానికి ఒక రోజు ముందు తన భార్యను ఇంటికి తీసుకెళ్తానని కౌన్సెలర్‌ ఎదుట హామీనిచ్చాడు.

అయితే భర్త ఈ హామీని విస్మరించాడు. దీంతో కౌన్సెలింగ్‌ అధికారులు భర్తను కేంద్రానికి పిలిపించారు. అక్కడికి వచ్చిన భర్త కౌన్సెలింగ్‌ అధికారులతో తన భార్య తన తల్లిదండ్రులతో అసభ్యకరమైన భాషలో మాట్లాడుతుంటుందని ఆరోపించాడు. ఉదయం 9 గంటల వరకు నిద్రపోతూనే ఉంటుందని, ఏ పనీ చేయదని పేర్కొన్నాడు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్‌ జరుగుతోంది. 

ఇది కూడా చదవండి: నగరమంతా తిప్పి.. సెల్‌ఫోన్‌తో ఉడాయించి..

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)