Breaking News

‘నా బిడ్డ తెల్లగా ఉందేంటి?’.. భార్యను కడతేర్చిన కసాయి భర్త

Published on Sun, 11/23/2025 - 12:37

పాట్నా: బీహార్‌లో విషాదం చోటు చేసుకుంది. తాళికట్టిన భార్యనే దారుణంగా హతమార్చాడో కసాయి భర్త. కారణం తను నల్లగా ఉన్నా.. తనకు పుట్టిన బిడ్డ తెల్లగా ఉండటమే.  

పోలీసుల వివరాల మేరకు.. కతిహార్ జిల్లా అబాద్‌పూర్ థానా పరిధి నారాయణ్‌పూర్ గ్రామంలో మహిళ హత్య కేసు స్థానికంగా తీవ్రంగా కలకలం రేపుతోంది. కుటుంబ కలహాలు,అనుమానం, ఇరుగుపొరుగు వారు సూటి పోటి మాటలు ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది.

అజమ్‌నగర్‌లోని జల్కి గ్రామానికి చెందిన సుకుమార్ దాస్, మౌసుమి దాస్ దంపతులకు మూడు నెలల క్రితం బిడ్డ పుట్టాడు. అయితే ఆ బిడ్డ చర్మరంగు తెల్లగా ఉంది. తాను నల్లగా ఉండటంతో దాని గురించి చుట్టుపక్కలవారు అనవసర వ్యాఖ్యలు, ఎగతాళి చేశారు. అవి సుకుమార్‌లో అనుమానాలు పెంచాయి. ఆ అనుమానం కాస్తా పెనుభూతంలా మారింది. దీంతో బిడ్డ పుట్టిన మరుక్షణం నుంచి సాఫిగా సాగిపోతున్న దాంపత్య జీవితంలో చిచ్చు రాజేశాయి.

ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మధ్యవర్తిత్వం చేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సరికాదా ఆ తగాదాలు మరింత తీవ్రమయ్యాయి. చేసేది లేక బాధితురాలు పుట్టింటుకొచ్చింది.  ఆ మరుసటి రోజే ముందస్తు ప్లాన్‌ ప్రకారం.. అత్తింట్లో ఉన్న భార్యను భర్త అత్యంత క్రూరంగా దాడి చేసి గొంతుకోసి ప్రాణం తీశాడు. అనంతరం సుకుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)