Breaking News

నా భార్యకు అక్రమ సంబంధం ఉంది.. అందుకే చంపేశా!

Published on Sun, 08/02/2026 - 08:01

కర్ణాటక: కలహాలు కుటుంబాల ఊపిరి తీస్తున్నాయి. చిన్న చిన్న గొడవలకే హత్య, ఆత్మహత్య చేసుకుని పసిపిల్లలను అనాథలు చేయడం అధికమైంది. ఇదే మాదిరిగా భార్యకు అక్రమ సంబంధం ఉన్నట్లు సెల్ఫీ వీడియోలో చెప్పి, ఆమెను చంపి, తరువాత భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హాసన్‌ జిల్లా బేలూరు తాలూకా కెసగోడు గ్రామంలో జరిగింది. రఘు (41), భార్య గగన(38) మృతులు. వీరికి 13 ఏళ్ల క్రితం పెళ్లి కాగా, 12, 6 ఏళ్ల వయసు గల పిల్లలు ఉన్నారు. 

చిక్కమగళూరులో బేకరి పెట్టుకొని జీవించేవారు. శుక్రవారం కారులో కెసగోడుకు వెళ్లారు. సాయంత్రం 6:30 గంటలకు రఘు బంధువులకు వీడియో కాల్‌ చేసి భార్యను హత్య చేస్తున్నట్లు చెప్పాడు. భార్యను కారులోనే గొంతు పిసికిచంపి, శవాన్ని పడేసి, ఊరికి సమీపంలో కారును నిలిపి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. బంధువులు, పోలీసులు చేరుకుని గాలించగా, అతని శవం కనిపించింది, గగన జాడ లేదు, ఆమెను యగచి కాలువలో పడేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అరేహళ్లి పోలీసులు గాలింపు చేపట్టారు.      

 

 

 

 

 

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)