Breaking News

వీడు మాములోడు కాదు.. హ్యూమన్‌ జీపీఎస్‌!

Published on Sat, 08/30/2025 - 16:30

వీడు నిజంగానే మామూలోడు కాదు. వెరీ వెరీ టాలెండెడ్‌ టెర్రరిస్టు. దశాబ్దాలుగా పీవోకే నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఉగ్రమూకలు భారత్‌లోకి చొరబడేందుకు దారులు చెప్పి సాయం చేసేవాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. వందకి పైగా ఉగ్రవాద చొరబాట్లకు కారకుడయ్యాడు. అందుకే హ్యూమన్ జీపీఎస్‌ (human GPS)గా బాగూఖాన్‌(Bagu Khan)కు పేరు ముద్రపడింది. 

జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక ఉగ్రవాది హతమయ్యాడు. దాదాపు 100పైగా ఉగ్రవాద చొరబాట్లకు కారకుడు, హ్యూమన్ జీపీఎస్‌గా పిలవబడే బాగూఖాన్‌(సమందర్‌ చాచా)ను కాల్చిచంపినట్లు ఆర్మీవర్గాలు వెల్లడించాయి. అతడు మరో ఉగ్రవాదితో కలిసి దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తుండగా ఎన్‌కౌంటర్ జరిగిందని తెలిపాయి. 

1995 నుంచి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి బాగూఖాన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఎలాంటి కఠిన మార్గాల్లోనైనా ఉగ్రమూకలు భారత్‌లోకి చొరబడేందుకు ఇతడు సహాయం చేసేవాడని, అందులో ఎక్కువభాగం విజయవంతం అయ్యాయని పేర్కొన్నాయి. అతడు హిజ్బుల్‌ కమాండర్‌గా ఉన్ననప్పటికీ.. ఈ టాలెంట్(భౌగోళిక పరిజ్ఞానం) వల్ల అన్ని ఉగ్రసంస్థలకు అతడు కీలకంగా మారాడు.  ఈ క్రమంలోనే హ్యుమన్‌ జీపీఎస్‌గా అతనికంటూ ఓ పేరు ముద్రపడింది.

భద్రతా బలగాల విజయాలు: ఈ ఎన్‌కౌంటర్‌తో పాటు, గత కొన్ని నెలల్లో జమ్మూకశ్మీర్‌లో 23 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. ఇందులో పాకిస్థానీయులు, స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. బాగూఖాన్‌ ఎన్‌కౌంటర్‌తో నౌషెరా ప్రాంతంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు. భద్రతా బలగాలు ఇంకా ఇతర దాగిన ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)