Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

Published on Mon, 11/24/2025 - 12:45

తమిళనాడు టెంకాసి జిల్లాలో ఈరోజు (సోమవారం) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు ప్రైవేట్ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. 

పోలీసులు తెలిపిన వివరాలు.. మదురై నుంచి శేంకొట్టైకి వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు, టెంకాసి నుంచి కోవిల్‌పట్టి వైపు వెళ్తున్న మరో బస్సు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి.

రెండు బస్సులు ఢీకొన్న తీవ్రత కారణంగా ఆ వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు భారీ రక్షణ చర్యలు చేపట్టారు.

ప్రాథమిక దర్యాప్తులో మదురై-శేంకొట్టై మార్గంలో వెళ్లిన ‘కీసర్’ అనే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. డ్రైవర్ అత్యధిక వేగంతో నడపడం వల్ల ప్రమాదం జరిగిందని సమాచారం.

ప్రమాదంలో గాయపడిన 28 మంది సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)