Mahakumbh: స్టేషన్‌లో రద్దీ.. ఏసీ కోచ్‌ అద్దాలు బద్దలు కొట్టి..

Published on Tue, 02/11/2025 - 09:17

సమస్తీపూర్‌: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఈ మహోత్సవానికి ఇంకా కొద్దిరోజులే మిగిలివుండటంతో చాలామందిలో కుంభమేళాకు ఇప్పటికైనా వెళ్లాలన్న ఆలోచన తలెత్తింది. దీంతో ఏ వాహనం దొరికితో ఆ వాహనంలో కుంభమేళాకు చేరుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా రైళ్లలో ప్రయాగ్‌ రాజ్‌కు చేరుకోవాలని ‍పలువురు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో బీహార్‌లోని రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. రైల్లో కూర్చొనేందుకు స్థలం దొరకకపోవడంతో ప్రయాణికులు రైలుపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.  

ప్రయాగ్‌రాజ్‌లో కుంభస్నానానికి వెళుతున్న యాత్రికులు రైలులో ఎలాగైనా ఎక్కాలనే ఆతృతలో స్వతంత్ర సేనాని సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని అన్ని ఏసీ కోచ్‌ల అద్దాలను బద్దలు కొట్టారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన నవాడా స్టేషన్‌లో జరిగింది. ఈ రైలులో ప్రయాణిస్తున్నవారు తెలిపిన వివరాల ప్రకారం జయనగర్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఈ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కేందుకు లెక్కకుమించినంతమంది ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే జనరల్‌ కంపార్ట్‌మెంట్‌ మొదలుకొని ఏసీ కోచ్‌ వరకూ దేనీలోని కాలు మోపేందుకు కూడా స్థలం లేకపోవడంతో స్టేషన్‌లోని ప్రయాణికుల్లో అసహనం మొదలయ్యింది.

బయట స్టేషన్‌లో ఉన్న జనాన్ని చూసిన రైలులోని వారు కోచ్‌ తలుపులను మూసివేశారు. దీంతో ముధుబని స్టేషన్‌లో రైలు కోసం వేచిచూస్తున్న ప్రయాణికులు ఏసీ కోచ్‌ అద్దాలను బద్దలుకొట్టారు. ఆ సమయంలో రైల్వే పోలీసులు అక్కడే ఉన్నా వారు ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటన నేపధ్యంలో రైలు 25 నిముషాల పాటు నవాడా స్టేషన్‌లో నిలిచిపోయింది. 

ఇది కూడా చదవండి: Madhya Pradesh: మహిళలకు నెలకు రూ. 3000.. సీఎం ప్రకటన

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)