Breaking News

లక్నో అగ్నిప్రమాదం: మరణంలోనూ వీడని స్నేహబంధం!

Published on Tue, 06/23/2026 - 08:57

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ఆలీగంజ్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం 15 మందిని బలితీసుకుంది. ఈ ప్రమాదంలో కాన్పూర్‌కు చెందిన ఇద్దరు ప్రాణస్నేహితులు, యానిమేషన్ స్టూడియో సహోద్యోగులు అయిన సంయమ్ విజ్ (28), సూరజ్‌భన్ సింగ్ (25) కూడా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

నాన్నమ్మ అంత్యక్రియలకు రావాల్సిన వాడు..
కాన్పూర్‌లోని గోవింద్ నగర్ బ్లాక్-11 నివాసి అయిన సంయమ్ విజ్ కుటుంబం ఇప్పటికే  శోకంలో మునిగి ఉంది. ఇటీవలే సంయమ్ నానమ్మ మరణించగా, మంగళవారం రోజున ఆమె 13వ రోజు ఆబ్ధికం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సంయమ్ లక్నో నుంచి ఇంటికి రావాల్సి ఉండగా, అంతలోనే అతను మరణించాడనే వార్త కుటుంబ సభ్యులను కుదిపేసింది. కొన్ని సంవత్సరాల క్రితమే తండ్రి పుష్పరాజ్ విజ్ మరణించడంతో, సంయమ్ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నాడు.

తల్లికి తెలియని కొడుకు మరణవార్త
మరో మృతుడు కాన్పూర్ బర్రా-7 నివాసి అయిన సూరజ్‌భన్ సింగ్ కథ కూడా  గుండెల్ని పిండేసేలా ఉంది. తండ్రి లేని ఆ కుటుంబంలో తల్లి మీరా దేవి, తమ్ముడు సామ్రాట్‌లకు సూరజ్‌భనే ప్రధాన ఆధారం. ప్రతి వారాంతంలో ఇంటికి వచ్చే సూరజ్‌భన్, ఆదివారమే తిరిగి లక్నోలో విధులకు హాజరయ్యాడు. అదే తన చివరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు. కొడుకు మరణవార్త వింటే ఎక్కడ గుండె పగిలిపోతుందోనని, ఆమె అనారోగ్యానికి గురవుతుందనే భయంతో బంధువులు ఇప్పటివరకు ఆ తల్లికి ఈ చేదు నిజం చెప్పలేదు.

మరణంలోనూ విడిపోని స్నేహం
సంయమ్, సూరజ్‌భన్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులు. కలిసి చదువుకున్నారు. ఒకే యానిమేషన్ స్టూడియోలో ఉద్యోగంలో చేరారు. చివరకు మరణంలోనూ  కలిసేవున్నారు. ఎంతో  భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నిపుణులు ఇలా అకాల మరణం చెందడంతో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెళ్లిళ్లు, కుటుంబ వేడుకల గురించి చర్చించుకోవాల్సిన ఇళ్లలో ఇప్పుడు అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఇది కూడా చదవండి: లక్నో అగ్ని ప్రమాదం: భవనం వెనుక విస్తుపోయే నిజాలు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)