రోడ్డుకు అడ్డంగా పడుకుని పోలీసు వినూత్న నిరసన.. ఏం జరిగిందంటే?

Published on Sun, 07/23/2023 - 10:34

ఛండీఘర్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోలీసుల అవినీతిని భరించలేక.. ఓ హోంగార్డ్‌ వినూత్న రీతిలో నిరసనకు దిగాడు. నేను దొంగలను అరెస్టు చేస్తే మా పోలీస్ స్టేషన్‌లో వాళ్లు లంచం తీసుకుని వదిలేస్తున్నారు అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసనకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఓ హోంగార్డ్.. తోటి పోలీసులు అవినీతి చూసి తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో హైవేకు అడ్డుగా ఓ తాడు కట్టి వాహనాలను నిలిపివేశాడు. అనంతరం.. రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపాడు. ‘నేను దొంగలను అరెస్టు చేస్తే మా పోలీస్ స్టేషన్‌లో వాళ్లు లంచం తీసుకుని వదిలేస్తున్నారు’ అంటూ భోగ్‌పూర్ ప్రాంతంలో పఠాన్‌కోట్‌ హైవేపై నిరసనకు దిగాడు. ఇది చూసిన వాహనదారులు ఒక్కసారిగా షాకయ్యారు. 

ఈ క్రమంలో అక్కడే మరో పోలీసు అధికారి.. నిరసనకు దిగిన హోంగార్డ్‌ను పైకిలేపే ప్రయత్నం చేశాడు. హోంగార్డ్‌ వినకపోవడంతో అతడిని కాలితో తన్నాడు. దీంతో, ఆయన ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఇక, ఈ ఘటనపై భోగ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి సుఖ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఒక గొడవకు సంబంధించి ఓ యువకుడిని హోంగార్డు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాడు. ఆ వ్యక్తి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.. అది మంజూరు చేయబడింది. దీని తర్వాత అతను విడుదలయ్యాడు. హోంగార్డు జవాన్‌ను తన్నలేదని సుఖ్‌జిత్ సింగ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: బొగ్గు కుంభకోణంలో మహిళా ఐఏఎస్‌ అరెస్ట్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)