Breaking News

‘ఈమెను చూస్తే దోమలకు వెన్నులో వణుకు’

Published on Sun, 04/13/2025 - 09:04

న్యూఢిల్లీ: ‘జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి’ అని అంటుంటారు. ఎవరి బుర్రలో ఏముందో ఇతరులు చెప్పలేరు. ఇదేకోవలోకి వస్తుంది.. ఆకాంక్ష రావత్‌(Akanksha Rawat).. ఈమె తన విచిత్రమైన హాబీతో సోషల్‌ మీడియా యూజర్లను ఆకట్టుకుంటోంది. ఆమె చేస్తున్న పనిని చూసిన జనం నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేస్తోంది?

ఆకాంక్ష రావత్‌కు చనిపోయిన దోమలను సేకరించడం, వాటికి సంబంధించిన వివిధ వివరాలతో లేబుల్ చేయడమనే వింత హాబీ ఉంది. తన అభిరుచిని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఒక వీడియో రూపంలో పోస్ట్‌ చేసింది. దీనిని చూసినవారంతా ‘ఇదేం వింత హాబీరా బాబూ’ అని అంటున్నారు. ఆ వీడియోలో ఆకాంక్ష రావత్‌  ఒక కాగితం షీట్‌ను చూపిస్తుంది. దానిపై చనిపోయిన దోమలు టేప్‌తో అతికించినట్లు కనిపిస్తాయి. ప్రతి దోమకు ఒక పేరు.. ఉదాహరణకు 'సిగ్మా బోయ్', 'రమేష్', 'బబ్లీ', 'టింకు' అని రాసివుంది. అలాగే వాటి మరణ సమయం, మరణ స్థలం లాంటి వివరాలు కూడా ఆ షీట్‌లో ఉన్నాయి.

ఈ వీడియోను రికార్డ్‌ చేసిన కెమెరాపర్సన్.. చాలామందికి వింత హాబీలు ఉంటాయి. వాటికి మించిన వింత హాబీ ఈమెకు ఉంది. ఆ వివరాలు నేను మీకు చూపిస్తాను అని అంటూ దోమల సేకరణ వివరాలను చూపిస్తారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో  ఐదు మిలియన్లకుపైగా వీక్షణలను దక్కించుకుంది. ఈ వీడియోను చూసినవారంతా పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక యూజర్‌ ‘ఈమెను చూసి దోమల సమాజమంతా భయపడుతోంది’ అని రాశారు. మరొకరు దోమలకు మగ పేర్లను పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. సాధారణంగా ఆడ దోమలే రక్తాన్ని పీలుస్తాయని వివరణ ఇచ్చారు. 

ఇది ​కూడా చదవండి: ఎన్‌ఐఏ విచారణలో రాణా మూడు డిమాండ్లు

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)